అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరం: తేల్చేసిన డీకే అరుణ

ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నట్టుగా  డీకే  అరుణ ప్రకటించారు. తన స్థానంలో బీసీ అభ్యర్ధిని బరిలోకి దింపుతామన్నారు. 

Iam not contest in  Telangana Assembly Elections  2023: says DK Aruna lns

హైదరాబాద్: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని  మాజీ మంత్రి, బీజేపీ నేత  డీకే అరుణ ప్రకటించారు. గద్వాలలో  బీసీ అభ్యర్ధిని బరిలోకి దింపుతామన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో  గద్వాల అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా  డీకే అరుణ పోటీ చేసి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్ధి  బండ్ల కృష్ణమోహన్ రెడ్డి  చేతిలో  ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో డీకే అరుణ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు.  బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా  ఆమె కొనసాగుతున్నారు.

ఈ దఫా అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలని డీకే అరుణ నిర్ణయం తీసుకున్నారు.ఈ విషయాన్ని బీజేపీ  నాయకత్వానికి కూడ ఆమె  చెప్పారు. ఇవాళ  న్యూఢిల్లీలో మాజీ మంత్రి డీకే అరుణ ఈ విషయాన్ని ప్రకటించారు.  

గద్వాల అసెంబ్లీ స్థానంనుండి  కాంగ్రెస్,  ఇండిపెండెంట్ అభ్యర్ధిగా  ఆమె పలు దఫాలు విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ దఫా  మాత్రం పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.  వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో  డీకే అరుణ పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  ఈ దఫా  అధికారం దక్కించుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంది.  దక్షిణాదిలో  కర్ణాటక తర్వాత తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది.

గత కొంతకాలంగా సునీల్ భన్సల్ నేతృత్వంలోని టీమ్  క్షేత్రస్థాయిలో పనిచేస్తుంది. తెలంగాణలో  బీజేపీ అగ్రనేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. రెండు మాసాల క్రితం  ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ ప్రజా ప్రతినిధులు  రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  పర్యటించారు.  పార్టీ పరిస్థితిపై  నివేదికను అందించారు.ఈ నివేదిక ఆధారంగా  బీజేపీ నాయకత్వం  రాష్ట్రంలో ఫోకస్ ను పెంచింది.  

also read:జేపీ నడ్డా నివాసంలో బీజేపీ తెలంగాణ నేతల భేటీ: మూడో జాబితా నేడు ఫైనల్ చేసే చాన్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  అధికారాన్ని దక్కించుకోవాలనే వ్యూహంతో బీజేపీ పావులు కదుపుతుంది.  ఇతర పార్టీల్లో టిక్కెట్లు దక్కని  అసంతృప్తులకు  బీజేపీ గాలం వేస్తుంది. మూడో జాబితాలో  ఇలాంటి వారికి టిక్కెట్ల కేటాయింపులో  ప్రాధాన్యత ఇవ్వనుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios