ఎన్నికల్లో పోటీ చేయాలని ఉంది: గద్దర్, పార్టీలోకి ఆహ్వానిస్తాం: తమ్మినేని

I wish to contest in elections says Gaddar
Highlights

ఎన్నికల్లో పోటీ చేయాలని తనకు  అన్పిస్తోందని  ప్రజా యుద్ద నౌక గద్దర్  ప్రకటించారు. ఇప్పటివరకు  తనకు ఓటు హక్కు లేదన్నారు. లాల్ నీల్ ఐక్యత చూస్తే తనకు ఓటు హక్కును నమోదు చేసుకోవాలనిపిస్తోందని ఆయన చెప్పారు.


హైదరాబాద్: ఎన్నికల్లో పోటీ చేయాలని తనకు  అన్పిస్తోందని  ప్రజా యుద్ద నౌక గద్దర్  ప్రకటించారు. ఇప్పటివరకు  తనకు ఓటు హక్కు లేదన్నారు. లాల్ నీల్ ఐక్యత చూస్తే తనకు ఓటు హక్కును నమోదు చేసుకోవాలనిపిస్తోందని ఆయన చెప్పారు.

లాల్ నీల్ ఐక్యతతో బహుజన రాజ్యాధికారం సాధ్యమని గద్దర్ అభిప్రాయపడ్డారు. ఆదివారంనాడు హైద్రాబాద్‌లో జరిగిన  బీఎల్ఎఫ్ సమావేశంలో  గద్దర్ పాల్గొన్నారు. లాల్ నీల్ ఐక్యతతో  నూతన పార్లమెంట్ తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.  అంబేద్కర్ విధానం పేరుతో ప్రజలను బీజేపీ మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. 

ఇప్పటివరకు ఎన్నికలపై తనకు నమ్మకం లేదన్నారు. కానీ, లాల్ నీల్ ఐక్యత కారణంగా తనకు ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన వస్తోందన్నారు. కమ్యూనిష్టు పార్టీలన్నీ ఐక్యం కావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకుగాను  ఓటు హక్కును నమోదు చేసుకొంటానని ఆయన చెకప్పారు.

గద్దర్ వ్యాఖ్యలకు సీపీఎం తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పందించారు.  ఎర్రజెండాల ఐక్యతకు బీఎల్ఎప్ కట్టుబడి ఉంటుందని చెప్పారు.  బీఎల్ఎఫ్‌లో ఇతర కమ్యూనిష్టు పార్టీలను కూడ కలుపుకొంటామని ఆయన చెప్పారు. బీఎల్‌ఎఫ్‌తో జత కట్టేందుకు చాలా పార్టీలు ఆసక్తిని చూపుతున్నట్టు ఆయన చెప్పారు. 

సీపీఐ ఏ ఫ్రంట్‌లో ఉన్నా కానీ ఆ పార్టీ అభ్యర్ధులకు తాము మద్దతిస్తామని ఆయన ప్రకటించారు.  అణగారిన వర్గాల చేతికి రాజ్యాధికారం కోసం బీఎల్ఎఫ్ పనిచేస్తోందని ఆయన చెప్పారు.

loader