Asianet News TeluguAsianet News Telugu

విజయం నాదే: పట్టబద్రుల స్థానంలో చెల్లని ఓట్లపై వాణీదేవి అసహనం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు చెల్లకపోవడంపై హైద్రాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన వాణీదేవి అసహనం వ్యక్తం చేశారు.

I will win in Mlc elections says surabhi vanidevi lns
Author
Hyderabad, First Published Mar 19, 2021, 3:03 PM IST

హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు చెల్లకపోవడంపై హైద్రాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన వాణీదేవి అసహనం వ్యక్తం చేశారు.

శుక్రవారం నాడు  సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ఉన్నత విద్యావంతులు సరిగా ఓటు హక్కును వినియోగించుకోకపోవడం దురదృష్టకరమన్నారు.

also read:హైద్రాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు: వాణీదేవి ముందంజ

తాము నేర్పిన చదువు ఇదేనా అనే బాధ కలుగుతోందన్నారు.  కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోందన్నారు.పార్టీ అన్ని రకాలుగా తనకు సహకరించిందని ఆయన చెప్పారు. ఈ స్థానంలో తాను విజయం సాధిస్తానని ఆమె ధీమాను వ్యక్తం చేశారు.పీవీ నరసింహారావుతో పాటు తన క్రెడిబిలిటీ, టీఆర్ఎస్ పార్టీ అండగా ఉండడం కారణంగానే తాను విజయం వైపు దూసుకు వెళ్తున్నానని ఆయన చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios