నా మాటకు కట్టుబడి ఉన్నా, ఆ తర్వాతే భవిష్యత్తు కార్యాచరణ: తేల్చేసిన మైనంపల్లి హన్మంతరావు
అనుచరులతో చర్చించిన తర్వాత తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. మెదక్ నుండి తన కొడుకు పోటీ చేస్తారని మైనంపల్లి హన్మంతరావు తేల్చి చెప్పారు.
హైదరాబాద్: అనుచరులతో చర్చించి తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నట్టుగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రకటించారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు సోమవారంనాడు మైనంపల్లి హన్మంతరావు సీరియస్ వ్యాఖ్యలు చేశారు. మల్కాజిగిరి నుండి బీఆర్ఎస్ టిక్కెట్టు మైనంపల్లి హన్మంతరావుకు దక్కింది. అయితే మెదక్ లో తన కొడుకు రోహిత్ ను బరిలోకి దింపాలని మైనంపల్లి హన్మంతరావు ప్లాన్ చేస్తున్నారు
. బీఆర్ఎస్ టిక్కెట్టు కోసం ప్రయత్నించారు. కానీ బీఆర్ఎస్ టిక్కెట్టును సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి టిక్కెట్టు కేటాయించింది. సోమవారంనాడు తిరుపతిలో మైనంపల్లి హన్మంతరావు మంత్రి హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. సిద్దిపేటలో తన తడాఖా చూపిస్తానని వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన తిరుపతిలోనే ఉన్నారు. ఏం చేయాలనే దానిపై మెదక్, మల్కాజిగిరిలో పార్టీ క్యాడర్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటానని మైనంపల్లి హన్మంతరావు ప్రకటించారు. తాను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. హరీష్ రావుపై తాను మాట్లాడింది వ్యక్తిగతమేనన్నారు. క్యాడర్ కోసం తాను ఏ నిర్ణయమైనా తీసుకుంటానని ఆయన తేల్చి చెప్పారు.
మెదక్ లో తన కొడుకు కచ్చితంగా పోటీ చేస్తాడని మైనంపల్లి హన్మంతరావు ధీమాగా చెప్పారు. ఈ విషయమై ఆయన మీడియా ప్రతినిధులతో ఫోన్ లో మాట్లాడారు. తాను తన మాటకు కట్టుబడి ఉన్నట్టుగా మైనంపల్లి హన్మంతరావు చెప్పారు. మాటకు కట్టుబడి ఉన్నట్టుగా ఆయన తేల్చి చెప్పారు.హరీష్ రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ తప్పు బట్టారు.
పోటీ చేయడం చేయకపోవడం ఆయన ఇష్టమని మైనంపల్లి హన్మంతరావుపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణను ఎవరూ ఉల్లంఘించినా వారిపై చర్యలు తీసుకుంటామని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో గత కొంత కాలగా మైనంపల్లి హన్మంతరావు తనయుడు రోహిత్ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ స్థానం నుండి పోటీకి మైనంపల్లి రోహిత్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో మెదక్ నుండి మైనంపల్లి హన్మంతరావు టీడీపీ అభ్యర్థిగా ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.తాను గతంలో ప్రాతినిథ్యం వహించిన మెదక్ నుండి తన కొడుకును రాజకీయాల్లోకి తీసుకురావాలని మైనంపల్లి హన్మంతరావు ప్లాన్ చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ టిక్కెట్టు మాత్రం రోహిత్ కు దక్కలేదు. అయితే హన్మంతరావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ నెలకొంది.