Asianet News TeluguAsianet News Telugu

ఆల్తు ఫాల్తు లెక్క కాదు ఇచ్చిన మాట తప్పను:కేసీఆర్

తాను ఆల్తు ఫాల్తు లెక్క కాదని ఇచ్చిన మాట తప్పనని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. వికారాబాద్ అభ్యర్థి డా.ఆనంద్ ను గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ 58 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్,టీడీపీ కూటమి ఒకవైపు 15ఏళ్లు కొట్లాడి, ప్రజలు అవకాశం ఇస్తే నాలుగున్నరేళ్లు పాలించిన టీఆర్ఎస్ ఒక వైపు ఉంది.

I will stick to my promises: KCR at Vicarabad
Author
Vikarabad, First Published Dec 4, 2018, 5:46 PM IST

వికారాబాద్: తాను ఆల్తు ఫాల్తు లెక్క కాదని ఇచ్చిన మాట తప్పనని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. వికారాబాద్ అభ్యర్థి డా.ఆనంద్ ను గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ 58 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్,టీడీపీ కూటమి ఒకవైపు 15ఏళ్లు కొట్లాడి, ప్రజలు అవకాశం ఇస్తే నాలుగున్నరేళ్లు పాలించిన టీఆర్ఎస్ ఒక వైపు ఉంది. ప్రజలు ఆందోళన పడొద్దని అభివృద్ధి చేసిన టీఆర్ఎస్ కు ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. 

కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా 24 గంటలు కరెంట్ ఇచ్చిందా అంటూ నిలదీశారు. మేధావులు అంటారు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు నాదే అంటారు మరి వాళ్లు ఎందుకు ఇవ్వలేకపోయారు అంటూ ప్రశ్నించారు. మరోవైపు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ తానే నిర్మించానంటాడు. ప్రపంచ పటంలో పెట్టానంటాడు.  మరి కరెంట్ ఎక్కడ పెట్టాడో చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఈరోజు 24 గంటలు విద్యుత్ వస్తుంది అంటే ఎంతో కష్టం చేస్తుంటే కానీ రాదని తెలిపారు. ఒళ్లు వంచి పనిచేస్తుంటే నాణ్యమైన విద్యుత్ వస్తుందన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది కానీ అమలు చేసిందా అంటూ ప్రశ్నించారు. 

కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కంటి వెలుగు, వంటి పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. రూ.43 వేల కోట్ల రూపాయలతో పథకాలు చేపట్టి అందరి అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు కన్ఫ్యూజన కావొద్దని తెలిపారు. 

పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి నీరు అందించే విషయంపై వెంటనే నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లాలోని 5 లక్షల ఎకరాలకు పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి నీరు అందించే బాధ్యత నాది అంటూ హామీ ఇచ్చారు. ఆల్తు పాల్తు మనిషిని కాదు కేసీఆర్ ని ఇచ్చిన మాట వెనక్కి తీసుకునే వాడిని కాదన్నారు. ప్రతీ ఎకరా పచ్చబడితేనే పోరాడి తెచ్చుకున్న తెలంగాణకు సార్థకత అన్నారు. 

అలాగే వికరాబాద్ జిల్లాను పాలమూరు జోన్ లో కలిపారని అందులో కాకుండా హైదరాబాద్ లో కలపాలని కోరుతున్నారు కలుపుతామని అయితే డాక్టర్ ఆనంద్ ను గెలిపించాలని కోరారు. ఆనంద్ ను గెలిపిస్తే హైదరాబాద్ లో కలుపుతామని హామీ ఇచ్చారు. 

కేసీఆర్ సీఎం కాకపోయి ఉంటే వికారాబాద్ జిల్లా వచ్చేదా అంటూ నిలదీశారు. కృతజ్ఞత ఉంటే ఆనంద్ ను గెలిపించాలని నాకు బహుమతిగా ఇవ్వాలన్నారు. ఆనంద్ కు కుళ్లు రాజకీయాలు తెలియవని స్వార్థం తెలియని వ్యక్తి అని కొనియాడారు. భార్య భర్తలు ఇద్దరూ పేదలకు వైద్యం చేస్తూ సేవలందిస్తున్నారని ఇటువంటి వారి సేవలు ఎంతో ఉపయోగకరమన్నారు. 

వికారాబాద్ స్వయంగా వచ్చి ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. అనంతగిరి ప్రాంతం ఒక అద్భుత ప్రాంతంగా తీర్చి దిద్దుతానని హామీ ఇచ్చారు. వికారాబాద్ జిల్లాలోని నాలుగు స్తానాలు గెలుస్తామని సర్వే వచ్చిందని తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios