అసంతృప్తి లేదు, అప్పటివరకు మంత్రినే: మీడియా చిట్ చాట్ లో కిషన్ రెడ్డి

మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ వరకు  తాను మంత్రి పదవిలో కొనసాగుతానని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  చెప్పారు.

I Will quit  Union Cabinet Soon Says  Kishan Reddy lns

హైదరాబాద్: మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ వరకు  తాను  మంత్రి పదవిలో కొనసాగుతానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.న్యూఢిల్లీలో  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు.   మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ వరకు  తాను  మంత్రిగా కొనసాగుతానని  ఆయన  చెప్పారు.  అప్పటివరకు  తాను  మంత్రి పదవితో పాటు  పార్టీ  బాధ్యతలను నిర్వహిస్తానని  కిషన్ రెడ్డి  తేల్చి  చెప్పారు.  

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని పార్టీ తనకు  కేటాయించడంతో  తనకు  ఎలాంటి అసంతృప్తి లేదన్నారు.  పార్టీ అప్పగించిన  బాధ్యతలను  తాను  సమర్థవంతంగా  నిర్వహించనున్నట్టుగా చెప్పారు.  పార్టీ నిర్ణయాలను  అందరూ  పాటించాల్సిందేనని  కిషన్ రెడ్డి  చెప్పారు.  ఒక్కరికి ఒక్క పదవే అనేది  బీజేపీ విధామన్నారు. ఈ విధానం మేరకు  తాను  మంత్రి పదవికి  రాజీనామా చేస్తానని  కిషన్ రెడ్డి  చెప్పారు.

ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు, వచ్చే  ఏడాదిలో  లోక్ సభ ఎన్నికలను దృష్టిలో  ఉంచుకొని బీజేపీ నాయకత్వం  బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుండి తప్పించింది.   మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు  ఎన్నికల మేనేజ్ మెంట్ నిర్వహణ కమిటీ చైర్మెన్ బాధ్యతలను అప్పగించింది బీజేపీ నాయకత్వం.

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను స్వీకరించేందుకు  కిషన్ రెడ్డి ఆసక్తిగా లేరనే  ప్రచారం కూడ లేకపోలేదు. అయితే  పార్టీ  ఆదేశాలను  పాటించే ఉద్దేశ్యంతో  అధ్యక్ష పదవిని  స్వీకరించేందుకు  కిషన్ రెడ్డి ముందుకు  వచ్చారని ఆయన వర్గీయులు  చెబుతున్నారు.  

also read:ఇవాళ సాయంత్రం హైద్రాబాద్‌కు కిషన్ రెడ్డి: పార్టీ నేతలతో భేటీ

ఈ ఏడాది  చివర్లో తెలంగాణ అసెంబ్లీకి  ఎన్నికలు  జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో  తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని కమలదళం  భావిస్తుంది. అంతేకాదు  అధికంగా ఎంపీ స్థానాలను  కైవసం చేసుకోవాలని  ఆ పార్టీ  ముందుకు వెళ్తుంది.తెలంగాణకు చెందిన కొందరు  నేతలు  బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పించాలని   పార్టీ నాయకత్వాన్ని కోరారు. పార్టీ నేతల డిమాండ్ , క్షేత్ర స్థాయిలో  అవసరాలను దృష్టిలో ఉంచుకొని  బండి సంజయ్ ను తప్పించి  కిషన్ రెడ్డికి పార్టీ అధ్క్ష బాధ్యతలను  బీజేపీ నాయకత్వం  కట్టబెట్టింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios