నా సత్తా ఏమిటో చూపిస్తా: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలో కార్యాలయాలను ఏర్పాటు చేసి తన సత్తాను నిరూపిస్తానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
ఖమ్మం: తన సత్తా ఏమిటో నిరూపిస్తానని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. శుక్రవారం నాడు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో కార్యాలయాలను ప్రారంభించనున్నట్టుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ప్రజలకు అండగా ఉంటానని ఆయన ప్రకటించారు. అంతేకాదు తన సత్తా ఏమిటో నిరూపిస్తానన్నారు. నాయకులు , కార్యకర్తల భరోసా కోసమే తాను పర్యటించనున్నట్టుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుండి ఆత్మీయ సమ్మేళనాలతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అభిమానులు, అనుచరులతో భేటీ అవుతున్నారు. ఈ నెల 6వ తేదీన కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఆత్మీయ సమ్మేళనాల్లో బీఆర్ఎస్ పై పరోక్షంగా విమర్శలు చేశారు. దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఉన్న సెక్యూరిటీని ప్రభుత్వం తగ్గించింది. దీంతో బీఆర్ఎస్ పై నేరుగానే విమర్శలు చేస్తున్నారు.
తనకు ఇచ్చిన హమీని బీఆర్ఎస్ నాయకత్వం అమలు చేయలేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఇంతకాలం పాటు తనను అవమానించారన్నారు. తనకు కానీ, తన అనుచరులకు కానీ పదవులు ఇవ్వలేదన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొందరి ఓటమికి కారణమనే నెపం వేసి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వలేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
also read:నాకు ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు.. అధికార మదంతో ఇబ్బంది పెట్టారు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడుతారని చాలా కాలంగా ప్రచారం సాగుతుంది. బీఆర్ఎస్ వీడుతారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంకేతాలు ఇస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరుతారనే విషయమై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ నెల 18న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశం కానున్నారని ప్రచారం సాగింది. కానీ అమిత్ షాతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ కాలేదు. కాంగ్రెస్ పార్టీ నుండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆహ్వానం అందింది. మరో వైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ పార్టీలో చేరుతారని వైఎస్ఆర్‌టీపీ చీప్ వైఎస్ షర్మిల ప్రకటించారు. అయితే ఈ నెల 6వ తేదీన కాుర్యకర్తల సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలో కూడ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధుల ఓటమే లక్ష్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పనిచేసే అవకాశం లేకపోలేదు.