Asianet News TeluguAsianet News Telugu

అభివృద్ధి కోసమే టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయం: సురేష్‌రెడ్డి

: తెలంగాణ రాష్ట్రం మంచి మార్గంలో వెళ్లేందుకు  తన రాజకీయ అవసరాలను పక్కన పెట్టి టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకొన్నట్టు  మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి చెప్పారు.

I will join in Trs soon says KR suresh reddy
Author
Hyderabad, First Published Sep 7, 2018, 12:38 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం మంచి మార్గంలో వెళ్లేందుకు  తన రాజకీయ అవసరాలను పక్కన పెట్టి టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకొన్నట్టు  మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి చెప్పారు.

శుక్రవారం నాడు ఆయన మంత్రి కేటీఆర్ తో కలిసి ఆయన హైద్రాబాద్ లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకొన్నట్టు చెప్పారు.

రాజకీయ లబ్ది కోసం తాను టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకోలేదన్నారు. రాష్ట్రం అభివృద్ధి సాగాలంటే టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.  అభివృద్ధి ఇంతే వేగంగా సాగాల్సిన  అవసరం ఉందన్నారు. నిన్ననే టీఆర్ఎస్ టిక్కెట్ల పంపిణీ జరిగిందన్నారు. కేసీఆర్ పిలుపు మేరకు అభివృద్దిలో పాలు పంచుకొంటున్నట్టు ఆయన చెప్పారు. 

 అంతకు ముందు టీఆర్ఎస్ లోకి  తాను  మాజీ స్పీకర్  సురేష్ రెడ్డిని ఆహ్వానించినట్టు  మంత్రి కేటీఆర్ చెప్పారు.  సురేష్ రెడ్డి స్థాయికి తగ్గట్టుగా సురేష్ రెడ్డికి పార్టీలో గౌరవం కల్పిస్తామని కేటీఆర్ హమీ ఇచ్చారు.

 పార్టీలు వేరైనా  తెలంగాణ సాధన కోసం  కేసీఆర్ తో  పాటు కేఆర్ సురేష్ రెడ్డి పనిచేసినట్టు కేటీఆర్ గుర్తు చేశారు.1989 నుండి  కేసీఆర్ కు సురేష్ రెడ్డి  మిత్రులుగా ఉన్నారని ఆయన చెప్పారు.

పార్టీలు వేరైనా తెలంగాణ కోసం  పనిచేసినట్టు  ఆయన చెప్పారు. తమ ఆహ్వానాన్ని మన్నించి  సురేష్ రెడ్డి  టీఆర్ఎస్ లో చేరేందుకు  ఒప్పుకొన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. 

ఈ వార్త చదవండి

కాంగ్రెస్‌కు షాక్: టీఆర్ఎస్‌లోకి మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి?

 

Follow Us:
Download App:
  • android
  • ios