Asianet News TeluguAsianet News Telugu

గులాబీ తెలంగాణను నీలి తెలంగాణ మారాలి, ఈ నెల 8న బీఎస్పీలోకి: మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్

ఈ నెల 8న బీఎస్పీలో చేరుతున్నట్టుగా మాజీ ఐపీఎస్  అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. గులాబీ తెలంగాణను  నీలి తెలంగాణ మార్చాలనేది తన ఉద్దేశ్యమన్నారు.
 

I will join in BSP on August 8 says former IPS RS Praveen Kumar
Author
Hyderabad, First Published Aug 6, 2021, 4:50 PM IST


హైదరాబాద్: ఈ నెల 8వ తేదీన బీఎస్పీలో చేరుతున్నానని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు.ఇటీవలనే ఆయన  ఐపీఎస్ ఉద్యోగానికి వీఆర్ఎస్ తీసుకొన్నారు.  ఆయన వీఆర్ఎస్‌కు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే కావాలనో,మంత్రి కావాలనో ఉద్దేశ్యంతో తాను బీఎస్పీలో చేరడం లేదన్నారు.

also read:కేసీఆర్... నీ కరెంట్ కట్ చేయడం ఖాయం: మాజీ ఐపిఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరిక

తెలంగాణలో గులాబీ తెలంగాణ నీలి తెలంగాణ కావాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో నల్గొండలో నిర్వహించే సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ప్రవీణ్ కుమార్ తెలంగాణలో గురుకుల స్కూల్స్‌లో అనేక సంస్కరణలకు  ఆద్యుడిగా మారాడు. గురుకుల స్కూల్స్ విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయడంలో ఆయన చేసిన కృషి పలువురి ప్రశంసలు పొందింది. రాజకీయాల్లో చేరడానికే ఆయన ఐపీఎస్ ఉద్యోగానికి వీఆర్ఎస్ తీసుకొన్నారు.  సమాజం కోసం ఇంకా సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే  తాను వీఆర్ఎస్ తీసుకొన్నట్టుగా ఆయన ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

 

Follow Us:
Download App:
  • android
  • ios