తాను వామపక్ష లౌకివాదినని..కానీ పరిస్థితులు బీజేపీ వైపు తీసుకెళ్లాయని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. 

హైదరాబాద్: తాను వామపక్ష లౌకివాదినని..కానీ పరిస్థితులు బీజేపీ వైపు తీసుకెళ్లాయని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం నాడు మధ్యాహ్నం మీడియాతో చిట్ చాట్ చేశారు. వచ్చే వారంలో న్యూఢిల్లీలో బీజేపీలో చేరుతానని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎవరు కంట్రోల్ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. 

also read:హుజూరాబాద్‌లో కీలక పరిణామం: ఈటల దళిత బాధితుల సమావేశం, జీపు యాత్రకు నిర్ణయం

ఎన్నికల్లో సీపీఐ పోటీలో ఉండాలా వద్దా అనేది ఎవరు నిర్ణయిస్తున్నారని ఆయన అడిగారు. 2018 ఎన్నికల్లోనే తనను ఓడించేందుకు టీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నాలు చేసిందని ఆయన ఆరోపించారు. ఇప్పటికే తనను హుజురాబాద్ లో ఓడించేందుకు రూ. 50 కోట్లు టీఆర్ఎస్ ఖర్చు చేసిందన్నారు. హరీష్ రావు తన కంటే ఎక్కువ అవమానాలకు గురయ్యారని ఆయన గుర్తు చేసుకొన్నారు. ఇవాళ ఉదయమే ఆయన టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. రేపు ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా పత్రాన్ని స్పీకర్ కు అందించనున్నారు.