హుజూరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ కు రాజీనామా చేయడంతో  హుజూరాబాద్ నియోజకవర్గంలో కీలక పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. ఈటల రాజేందర్ బాధితులు సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని  17 దళిత కుటుంబాలు తమకు అన్యాయం జరిగిందని చెబుతున్నారు. ఈటల రాజేందర్  తమ కుటుంబాలపై అక్రమంగా  కేసులతో పాటు పీడీ కేసులు నమోదు  చేశారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. 

also read:ఇన్నాళ్లు బీసీలు, దళితులు గుర్తుకురాలేదా.. ఆస్తుల రక్షణ కోసమే బీజేపీలోకి: ఈటలపై గంగుల ఆరోపణలు

ఇవాళ దళిత కుటుంబాలు సమావేశమై కీలక నిర్ణయం తీసుకొన్నాయి. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో జీపు యాత్ర నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు.  ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఆరు మాసాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో ఈ ప్రచారం ఆయనపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందా లేదా అనేది ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి. టీఆర్ఎస్ కు ఈటల రాజేందర్ ఇవాళ రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు. రాజీనామా పత్రాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి రేపు సమర్పించనున్నారు.