వచ్చే నెలలో గజ్వేల్ కి వస్తానని  అడ్డం వచ్చినవారిని తొక్కుకొంటూ వస్తానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. మూడు చింతలపల్లిలో ఆయన 48 గంటల దీక్షను ఆయన ప్రారంభించారు.

హైదరాబాద్: వచ్చే నెలలో గజ్వేల్ గడ్డ మీదికి వస్తానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. అడ్డం వచ్చే టీఆర్ఎస్ శ్రేణులను తొక్కుకుంటూ వెళ్తానని ఆయన ప్రకటించారు. ఒకవేళ అలా చేయకపోతే అక్కడే గుండు గీయించుకొంటానని ఆయన ప్రకటించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

also read:అలా అయితే రాజీనామా చేస్తా, చర్చకు సిద్దమా?: మూడు చింతలపల్లిలో దళిత గిరిజన దీక్షలో రేవంత్

కేసీఆర్ దత్తత తీసుకొన్న మూడు చింతలపల్లిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దళిత గిరిజన దీక్షను మంగళవారం నాడు ప్రారంభించారు. 48 రోజుల పాటు ఈ దీక్షను కొనసాగిస్తారు. తాను ఈ దత్తత గ్రామాల్లోకి రాకుండా ఉండాలని కొందరితో తనపై విమర్శలు చేయించాడని కేసీఆర్ పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ విమర్శలపై తాను ఇక్కడి నుండి మాట్లాడేందుకే ఇంతకాలం మౌనంగా ఉన్నానని ఆయన చెప్పారు. 

తనపై విమర్శలు చేసిన గ్రామాలకు రాకుండా అడ్డుకోవాలని టీఆర్ఎస్ నేతలు పన్నాగం పన్నారన్నారు. ఫామ్‌హౌస్‌ పక్కకు వచ్చి ఈ విమర్శలకు సమాధానం చెప్పేందుకే తాను ఇంతకాలం నోరు తెరవలేదన్నారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు తాను భయపడేది లేదన్నారు. కేసీఆర్ దత్తత తీసుకొన్నా ఈ గ్రామాల్లో ప్రజలు కాంగ్రెస్ జెండాకే అండగా నిలిచారని ఆయన గుర్తు చేశారు.