Asianet News TeluguAsianet News Telugu

మల్లారెడ్డిని బర్రె కరిచిందనుకుంటా.. బీఆర్ఎస్ శకం ముగిసింది - బండ్ల గణేష్

కాంగ్రెస్ నాయకుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్ (BANDLA GANESH).. మాజీ మంత్రి మల్లారెడ్డి (MALLA REDDY)పై ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి (Revanth reddy)ని ఎవరూ ముట్టుకోలేరని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ (BRS)శకం ముగిసిందని చెప్పారు. ఇక కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) మధ్యే పోటీ ఉంటుందని అన్నారు.

I think Malla Reddy was bitten by a buffalo.. Brs era is over - Bandla Ganesh..ISR
Author
First Published Feb 3, 2024, 8:13 AM IST | Last Updated Feb 3, 2024, 8:14 AM IST

బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి మల్లారెడ్డిపై కాంగ్రెస్ నాయకుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లారెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని, చిన్నప్పుడు ఆయనను బర్రె కరించిందేమో అంటూ తీవ్రంగా దుయ్యబట్టారు. స్థాయికి తగిన విధంగా మాట్లాడాలని సూచించారు. శనివారం కాంగ్రెస్ నాయకులతో కలిసి బండ్ల గణేష్ మీడియాతో మాట్లాడారు. 

భర్త శాడిజం.. 12 ఏళ్లుగా ఇంట్లోనే భార్య బందీ.. కిటికీ ద్వారానే పిల్లల బాగోగులు..

స్కూల్స్, కాలేజీలు కట్టి ఫీజులను దోచుకుంటూ మల్లారెడ్డి రాజకీయాలను కొనుగోలు చేస్తున్నారని బండ్ల గణేష్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏకవచనంతో సంబోధిస్తున్నారని, ముఖ్యమంత్రి అనే పదవికి గౌరవం ఇవ్వాలని, స్థాయికి తగిన విధంగా మాట్లాడాలని అన్నారు. మల్లారెడ్డిని దున్నపోతు అంటూ అభివర్ణించారు. గోవాలో హోటల్ గానీ, క్యాషినో గానీ ఏదైనా పెట్టుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మీ తండ్రి, తాతలు వచ్చిన తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని తెలిపారు. రేవంత్ రెడ్డిని ఎవరూ ముట్టుకోలేరని బండ్ల గణేష్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుత పాలన అందిస్తోందని, త్వరలోనే రెండు గ్యారెంటీలను అమలు చేస్తోందని అన్నారు. రేవంత్ రెడ్డి రోజుకు 20 గంటలు పని చేస్తున్నారని అన్నారు. భారతదేశంలోని ఏ సీఎం పడని కష్టం తెలంగాణ సీఎం పడుతున్నారని అన్నారు. 

తెలంగాణలో మచ్చలేని ఆఫీసర్లను నియమించి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నడిపిస్తున్నారని బండ్ల గణేష్ ప్రశంసలు కురిపించారు. పోలీసు పనుల్లో ఎలాంటి రాజకీయ ప్రమేయం ఉందని సీఎం చెప్పారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి పాలన చూసి ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారని అన్నారు. ఆయన నాయకత్వంలో పని చేస్తున్నందుకు తామంతా గర్వపడుతున్నామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఇక లేదు, రాదు, రాబోదని తేల్చి చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని, బీఆర్ఎస్ శకం ముగిసిపోయిందని అన్నారు. 

ట్రక్కు డ్రైవర్లకు మోడీ శుభవార్త .. త్వరలో హైవేలపై 1000 విశ్రాంతి కేంద్రాలు , ఫుల్ ఫెసిలిటీస్‌తో

ఇదిలా ఉండగా.. మల్కాజిగిరీ నుంచి లోక్ సభ బరిలో నిలిచేందుకు బండ్ల గణేష్ సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన శుక్రవారం గాంధీ భవన్ లో మల్కాజిగిరి ఎంపీ టిక్కెట్ కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేధికగా వెల్లడించారు. ‘‘ మల్కాజ్ గిరి పార్లమెంట్ అభ్యర్థిగా గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకున్నాను. మీ అందరి ఆశీస్సులు కావాలి’’ అని ఆయన పేర్కొన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios