పార్టీ మారే ముందు పదవులకు రాజీనామా చేయాలి: వెంకయ్య

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 28, Aug 2018, 6:48 PM IST
I never wanted to vice president post says venkaiahnaidu
Highlights

 ప్రజల్లో ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఉంటే  ఎలాంటి గాలిని  కూడ ఎదుర్కోవచ్చని ఉపరాష్ట్రతి వెంకయ్యనాయుడు చెప్పారు. ఉపరాష్ట్రపతి పదవిని తానేప్పుడూ కోరుకోలేదన్నారు

హైదరాబాద్: ప్రజల్లో ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఉంటే  ఎలాంటి గాలిని  కూడ ఎదుర్కోవచ్చని ఉపరాష్ట్రతి వెంకయ్యనాయుడు చెప్పారు. ఉపరాష్ట్రపతి పదవిని తానేప్పుడూ కోరుకోలేదన్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికై ఏడాది దాటిన తర్వాత హైద్రాబాద్‌లో వెంకయ్యనాయుడు తేనీటి విందు ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన తన రాజకీయ జీవితం గురించి ఆసక్తికర విషయాలను ఆయన మాట్లాడారు. జయప్రకాష్ నారాయణ ఉద్యమంలో తాను పాల్గొని జైలుకు వెళ్లిన సమయంలో తనను అరెస్ట్ చేసి జైలుకు పంపారని ఆయన గుర్తు చేసుకొన్నారు. అయితే ఆ సమయంలోనే  వచ్చిన ఎన్నికల్లో  తనకు ఎంపీ టిక్కెట్టు ఇచ్చారని చెప్పారు. అయితే ఆ ఎన్నికల్లో తాను ఓటమి పాలైనట్టు ఆయన చెప్పారు.

అయితే ఆ తర్వాత ఉదయగిరికి జరిగిన అసెంబ్లీ స్థానం నుండి జరిగిన ఎన్నికల్లో  విజయం సాధించినట్టు ఆయన గుర్తు చేసుకొన్నారు. ఆ ఎన్నికల్లో తనకు ప్రజల నుండి విరాళాలు వచ్చినట్టు చెప్పారు.

రెండో దఫా కూడ  ఈ రకంగానే  తాను విజయం సాధించినట్టు చెప్పారు. ఎన్టీఆర్  టీడీపీని ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన ఎన్నికల సమయంలో  కూడ  ఎన్టీఆర్ సభకు హజరైన జనం  ఎన్టీఆర్ జిందాబాద్ వెంకయ్య జిందాబాద్ అంటూ  నినాదాలు చేసుకొంటూ వెళ్లారని  ఆయన ప్రస్తావించారు.

ఉదయగిరిలో తనను ఓడించేందుకు ఆనాడు ఇంధిరాగాంధీ సభను ఏర్పాటు చేయించారని చెప్పారు. తన కోసం వాజ్‌పేయ్ తన షెడ్యూల్‌ను మార్చుకొని  ఉదయగిరిలో సభలో పాల్గొన్నారని ఆయన గుర్తు చేసుకొన్నారు. 

గతంలో చట్టసభల్లో పనిచేసిన మహానుభావులు ఏ రకంగా మాట్లాడేవారు... తాను ఎలా మాట్లాడాలనే విషయమై  తాను  ఎప్పటికప్పుడు  సమీక్షించుకొనేవాడినని ఆయన చెప్పారు.   ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి పదవులు తాను ఏనాడూ కోరుకోలేదన్నారు. ఈ పదవుల గురించి  తన పేరు బయటకి వచ్చిన సమయంలో ఈ పదవి తనకు అవసరం లేదని  మోడీకి చెప్పినట్టు ఆయన తెలిపారు.

విమర్శలను తట్టుకొనే శక్తి నేటీ పాలకుల్లో లోపించిందని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. రాజ్యసభలో సమావేశాలు జరుగుతున్న తీరు చూస్తోంటే సిగ్గేస్తోందన్నారు. అన్ని పార్టీలు ఈ విషయమై సమీక్షించుకోవాలని ఆయన సూచించారు.

మంత్రిగా ఉన్నప్పుడే పదవికి రాజీనామా చేసి 2020 జనవరి 12 వతేదీన ఢిల్లీని వదిలేసి రావాలని నిర్ణయించుకొన్నట్టు చెప్పారు. సమాజంలో ప్రస్తుతం తప్పును తప్పు అని చెప్పే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఎంపీలు స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం లేకుండా పోయిందన్నారు.

సమావేశాలను బహిష్కరించడం సమంజసం కాదన్నారు. ప్రజాస్వామ్యంలో పార్టీలు మారే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు. అయితే పార్టీ మారే సమయంలో తమ పదవులకు రాజీనామాలు చేయాలన్నారు. 

loader