లోకసభలో ప్రధాని మోడీని రాహుల్ గాంధీ ఆలింగనం చేసుకోవడం, ఆ తర్వాత కన్ను గీటడం దృశ్యాలపై తెలంగాణ మంత్రి కేటి రామారావు స్పందించారు.
హైదరాబాద్: లోకసభలో ప్రధాని మోడీని రాహుల్ గాంధీ ఆలింగనం చేసుకోవడం, ఆ తర్వాత కన్ను గీటడం దృశ్యాలపై తెలంగాణ మంత్రి కేటి రామారావు స్పందించారు. పార్లమెంట్‌లో పెద్ద డ్రామాను చూడటం మిస్సయ్యానని కేటీఆర్ ట్విట్టర్‌లో అన్నాడు.
హగ్గుల్నీ, కన్నుకొట్టడాల్ని చూడలేక పోయానని చెప్పారు. లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చలో భాగంగా తన ప్రసంగం ముగించిన తర్వాత రాహుల్ హుటాహుటిన వెళ్లి మోడీని ఆలింగనం చేసుకున్నారు. తిరిగి వచ్చి తన సీట్లో కూర్చుని కన్ను గీటారు. తాను ఆ దృశ్యాలను లైవ్‌లో చూడలేకపోయాననే నిరాశను కేటిఆర్ వ్యక్తం చేశారు.
లోకసభలో తనను ఆలింగనం చేసుకుని వెళ్లిపోతున్న రాహుల్‌ను మోడీ వెనక్కి పిలిచారు. కరచాలనం చేసి రాహుల్ భుజంపై తట్టారు.
Scroll to load tweet…
