Asianet News TeluguAsianet News Telugu

నా డిగ్రీ సర్టిఫికెట్లను బయటపెట్టడంలో నాకెలాంటి అభ్యంతరమూ లేదు - మంత్రి కేటీఆర్

తనకు రెండు మాస్టర్స్ డిగ్రీలు ఉన్నాయని, అవసరమైతే వాటిని తాను బయటపెట్టగలనని, అందులో తనకు ఎలాంటి అభ్యంతరమూ లేదని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రధాని మోడీ డిగ్రీ సర్టిఫికెట్ల అంశంపై గుజరాత్ హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా ట్వీట్ చేశారు. 

I have no objection in revealing my degree certificates.. Minister KTR..ISR
Author
First Published Apr 1, 2023, 8:46 AM IST

ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీ సర్టిఫికెట్లను బయటపెట్టాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు తీర్పు ఇచ్చిన కొన్ని గంటల తరువాత ఈ విషయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. తనకు డిగ్రీ సర్టిఫికెట్లు ఉన్నాయని, వాటిని బటయపెట్టడంలో తనకు ఎలాంటి అభ్యంతరమూ లేదని పరోక్షంగా ప్రధానిపై సెటైర్లు వేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం రాత్రి ట్వీట్ చేశారు. 

డిటోనేటర్ల అక్రమ రవాణా..ఇద్దరిని అరెస్టు చేసిన ఎన్‌ఐఏ..

‘‘ నేను పుణె యూనివర్సిటీ నుంచి బయోటెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశాను. సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. రెండు సర్టిఫికెట్లను నేను బహిరంగంగా పంచుకోగలను’’ అంటూ ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రధాని డిగ్రీ సర్టిఫికెట్ల వివరాలు సమర్పించాలని పీఎంవో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, గుజరాత్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ పీఐవోలను ఆదేశిస్తూ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సీఐసీ) జారీ చేసిన ఉత్తర్వులను గుజరాత్ హైకోర్టు కొట్టి వేసిన నేపథ్యంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ప్రధాని మోడీ విద్యార్హతలు కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన ఆర్టీఐ పిటిషన్ రాజకీయంగా ఇబ్బందికరంగా, ప్రేరేపితంగా కనిపిస్తోందని అభిప్రాయపడుతూ గుజరాత్ హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఈ పిల్ ప్రజాప్రయోజనాల ఆధారంగా కాకుండా రాజకీయ ప్రేరేపితమని పేర్కొంటూ గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీరేన్ వైష్ణవ్ ఆప్ చీఫ్ కు రూ.25,000 జరిమానా విధించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు విధించిన జరిమానా మొత్తాన్ని ఆయన నాలుగు వారాల్లోగా గుజరాత్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది.

కేజ్రీవాల్ తరఫు న్యాయవాది పెర్సీ కవిత అభ్యర్థన మేరకు జస్టిస్ వైష్ణవ్ తన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించారు. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ప్రధాని మోడీ మాస్టర్ ఇన్ ఆర్ట్స్ (ఎంఏ) డిగ్రీ వివరాలను అందించాలని సీఐసీ గతంలో ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ గుజరాత్ యూనివర్సిటీ 2016లో పిటిషన్ దాఖలు చేసింది. దానిని హైకోర్టు స్వీకరించింది. మూడు నెలల తరువాత సీఐసీ ఉత్తర్వులపై స్టే విధించింది. ఫిబ్రవరి 9వ తేదీన ఈ కేసులో వాదనలు ముగించిన ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది. 

మాస్క్ తప్పనిసరి.. పెరుగుతున్న XBB.1.16 వేరియంట్ కేసులు

గుజరాత్ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ఎంఎన్ పటేల్ ప్రకారం.. ప్రధాని మోడీ 1983 లో పొలిటికల్ సైన్స్ లో ఎంఏ పూర్తి చేశారు. కాగా.. కొంత కాలం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాని విద్యార్హతలను టార్గెట్ చేస్తూ ప్రచారం చేస్తోంది. ‘‘స్వతంత్ర భారతదేశ చరిత్రను పరిగణనలోకి తీసుకుంటే కేవలం 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన ప్రధాని దేశంలో ఎప్పుడూ లేరు’’ అంటూ కేజ్రీవాల్ ఇటీవల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాగా తాజా తీర్పుపై కూడా ఆయన ట్విట్టర్ లో స్పందించారు. ‘‘తమ ప్రధాని విద్య గురించి తెలుసుకునే హక్కు కూడా దేశానికి లేదా? డిగ్రీ చూపించడాన్ని కోర్టులో ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకు ? డిగ్రీలు చూడాలని డిమాండ్ చేసే వారికి కూడా జరిమానా విధిస్తారా? ఇంతకీ ఏం జరుగుతోంది? నిరక్షరాస్యుడైన లేదా ఎక్కువగా చదువుకోని ప్రధాని దేశానికి చాలా ప్రమాదకరం.’’ అని ఆయన ట్వీట్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios