రైతుబంధు ఆపాలని నేను ఫిర్యాదు చేయలేదు.. ఉత్తమ్‌కుమార్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ మాజీ చీఫ్, కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ చెబుతున్నట్టుగా రైతుబంధు ఆపాలని తానెక్కడా ఫిర్యాదు చేయలేదని అన్నారు.

I did not complain to stop rythu bandhu says uttam kumar reddy ksm

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ మాజీ చీఫ్, కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ చెబుతున్నట్టుగా రైతుబంధు ఆపాలని తానెక్కడా ఫిర్యాదు చేయలేదని అన్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు.. కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రైతుబంధుతో పాటు ఇతర పథకాలను నామినేషన్ ప్రక్రియ కంటే ముందే నిధులు విడుదల చేయాలని తాము డిమాండ్ చేసినట్టుగా చెప్పారు. రైతుబంధు నిధులు పెంచాలని తాము కోరుతున్నామని చెప్పారు. తాను గానీ, కాంగ్రెస్ నాయకులు గానీ.. రైతుబంధు ఆపాలని కోరలేదని స్పష్టం చేశారు. 

కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు 70 ఏళ్లుగా లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నప్పటికీ చెక్కు చెదరలేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాసిరకం నిర్మాణం కారణంగానే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని ఆరోపించారు. నీళ్లు ఇవ్వకముందే ప్రాజెక్టులు కూలిపోతున్నాయని విమర్శించారు. మూడోసారి రిస్క్ తీసుకునే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని అన్నారు. ఈ సారి కేసీఆర్‌ను నమ్మి మోసపోరని చెప్పారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ను ప్రజలు ఇంటికి పంపుతారని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ వైఫల్యాలపై క్షమాపణలు చెప్పాకే కేసీఆర్ కుటుంబం ఓట్లు అడగాలని అన్నారు. 

వ్యవసాయానికి ఉచిత కరెంట్ మొదలు పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వమని చెప్పారు. అధికారంలోకి రాగానే రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వబోతున్నామని తెలిపారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్.. రైతులను మోసం చేశారని మండిపడ్డారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios