హైదరాబాద్: హైద్రాబాద్‌లో సుమారు 127 మందికి ఆధార్ సంస్థ నోటీసులు జారీ చేసిన ఘటనపై సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అబ్దుల్ సత్తార్ అనే వ్యక్తి  తప్పుడు పత్రాలతో  ఆధార్ కార్డులను ఇప్పిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే అబ్దుల్ సత్తార్‌తో పాటు మరో 127 మందికి ఆధార్ సంస్థ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.

 హైద్రాబాద్‌లో ఉంటున్న రోహింగ్యాలకు అబ్దుల్ సత్తార్ నకిలీ పత్రాలతో ఆధార్ కార్డులను ఇప్పించినట్టుగా సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.హైద్రాబాద్ పాతబస్తీలో బ్రోకర్లతో నకిలీ పత్రాలను సృష్టించి ఆధార్ కార్డులను ఇప్పిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే సత్తార్‌తో పాటు అనుమానం ఉన్న 127 మందిపై పోలీసులు విచారణ చేయాలని భావించారు.

ఇందులో భాగంగానే పూర్తి వివరాల కోసం తెలంగాణ పోలీసులు ఆధార్ సంస్థకు లేఖ రాశారు. పోలీసు శాఖ  సూచన మేరకు సరైన పత్రాలతో తమ ముందుకు రావాలని  ఆధార్ సంస్థ 127 మందికి నోటీసులన పంపింది. 

Also read:హైదరాబాదీలకు ఆధార్ నోటీసులు.. ఎంతమంది ముస్లింలు ఉన్నారంటూ అసదుద్దీన్ ఫైర్

బాలాపూర్‌లోని రోహింగ్యా బేస్ క్యాంపులో ఉన్న వారిలో తప్పుడు పత్రాలతో  ఆధార్ కార్డులు తీసుకొన్నవారిని పోలీసు శాఖ గుర్తించింది. 33 మంది తప్పుడు పత్రాలతో ఆధార్ కార్డులను పొందినట్టుగా సమాచారం.  

హైద్రాబాద్‌లో ఈ 127 మందే కాకుండా మరో వెయ్యి మంది కూడ ఇదే తరహలో తప్పుడు పత్రాలతో ఆధార్ కార్డులను పొందారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై కూడ ఆరా తీస్తోంది.

ఇదిలా ఉంటే హైద్రాబాద్ లో 127 మందికి ఆధార్ సంస్థ నోటీసులు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. పౌరసత్వాన్ని ప్రశ్నించే అధికారం ఆధార్ సంస్థకు లేదని హైద్రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు.