Asianet News TeluguAsianet News Telugu

ఫ్లిప్ కార్ట్ పై  హైదరాబాదీ పోరాటం

  • ఈ కామర్స్ వెబ్ సైట్ కు చుక్కలు చూపెట్టిన వినియోగదారుడు. నాసిరకం ఫోన్ చార్జర్ ను అంటగట్టినందుకు వినియోగదారుల ఫోరంలో కేసు నమోదు

 

hyderabadi fight against flipkart in dist consumer forum

ఫ్లిప్ కార్ట్...

ఆన్ లైన్ షాపింగ్ చేసే వారికి దీని గురించి పరిచయమే అక్కర్లేదు. దేశంలోనే ఈ కామర్స్ దిగ్గజాల్లో ఒకటి.

 

హైదరాబాద్ కు చెందిన డాక్టర్ అహ్మద్ ఇర్ఫానీ అనే వ్యక్తి ఇలాంటి దిగ్గజ సంస్థపై పోరాడి విజయం సాధించారు. తనకు జరిగిన నష్టానికి ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేయించాడు.

 

ఇంతకీ విషయం ఎంటంటే...

 

హైదరాబాద్ కు చెందిన ఇర్ఫానీ గత జనవరి లో తన స్మార్ట్ ఫోన్ కోసం చార్జర్ ను ఫ్లిప్ కార్ట్ లో బుక్ చేశారు. ఇందుకోసం షిప్పింగ్ చార్జీలతో సహా 289 రూపాయిలు చెల్లించాడు.

 

అయితే ఫోన్ కు ఆ చార్జర్ కనెక్ట్ చేయగానే పొగలొచ్చాయి. విలువైన స్మార్ట్ ఫోన్ పాడైపోయింది. చార్జర్ వల్లే ఇదంతా జరిగిందని భావించన అతడు ఫ్లిప్ కార్డ్ సంస్థ దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చాడు. అయితే వాళ్లు చార్జర్ ను రిప్లేస్ చేస్తామని బదులిచ్చారు.

 

ఇర్ఫాన్ మాత్రం నాసిరకం ఫోన్ వల్లే తన విలువైన ఫోన్ పాడైపోయిందని కాబట్టి ఫోన్ కు డబ్బులు కూడా చెల్లించాలని కోరాడు. దానికి ఫ్లిప్ కార్ట్ యాజమాన్యం ఒప్పుకోలేదు.

 

దీంతో ఫ్లిప్ కార్ట్ యాజమాన్యంతో న్యాయపోరాటం దిగేందుకు ఇర్ఫానీ సిద్ధమయ్యాడు. తనకు న్యాయం చేయాలని జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు.

 

అయితే ఫ్లిప్ కార్ట్ యాజమాన్యం చార్జర్ విషయంపై స్పందిస్తూ... తాము కంపెనీ, వినియోగదారుడికి మధ్యవర్తిగా మాత్రమే ఉంటామని చార్జర్ నాసిరకంగా ఉంటే అది తయారు చేసిన కంపెనీ తప్పు అవుతుంది కానీ మాది కాదు అని ఫోరంలో వాదించింది. అయితే ఈ వివరణతో ఏకీభవించని ఫోరం వినియోగదారుడైన ఇర్ఫానీకి రూ. 15 వేలు నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios