Hyderabad : హైదరాబాద్ లోని మాదాపూర్, జూబ్లీహిల్స్‌లో బైకుపై వెళ్తూ పోకిరీలు రెచ్చిపోయారు. అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Hyderabad : హైదరాబాద్ లోని మాదాపూర్‌లో యువతులు స్కూటీపై వెళ్తుండగా, ముగ్గురు పోకిరీలు బైక్‌పై వెనుకనుంచి ఫాలో అవుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ఒక్కసారిగా ఆమె వెనుకనుంచి తాకుతూ వెకిలి చేష్టలకు పాల్పడ్డారు.
ఆ సమయంలో కారులో వెళ్తున్న ఓ మహిళ ఈ దృశ్యాలను వీడియో తీశారు. దానిని వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ కావడంతో ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తింది.
సోషల్ మీడియాలో యూజర్లు ముగ్గురు పోకిరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పందించిన సైబరాబాద్ పోలీసులు వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనలో ముగ్గురు యువకులు బైక్‌పై వుండగా, స్కూటీపై ప్రయాణిస్తున్న అమ్మాయిలను ఫాలో అవుతూ వేధించారు. నెమలి ఈకలతో వెనుకనుంచి తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ దృశ్యాన్ని వెనుక కారులో ప్రయాణిస్తున్న వారు వీడియో తీసి ప్రశ్నించగానే పోకిరీలు వేగంగా పారిపోయారు.
ఈ ఘటన నెటిజన్లలో ఆగ్రహం రేకెత్తించింది. “ఇలాంటి పోకిరీల వల్లే హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటోంది” అని వ్యాఖ్యలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరం రోడ్లపై పోకిరీల ఆగడాలు పెరుగుతున్న నేపథ్యంలో, పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.
