MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • ఐఎండీ రెడ్ అలర్ట్: బయటకు రాకండి.. తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు

ఐఎండీ రెడ్ అలర్ట్: బయటకు రాకండి.. తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు

Telangana Heavy Rains: తెలంగాణలో రాబోయే కొన్నిగంటల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి.

2 Min read
Mahesh Rajamoni
Published : Aug 27 2025, 06:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలంగాణలో కుండపోత వర్షాలు.. అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్
Image Credit : Getty

తెలంగాణలో కుండపోత వర్షాలు.. అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్

తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ వారం మొత్తం భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు గంటల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. 

ఐఎండీ హెచ్చరికల మధ్య ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించారు. జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సహాయం అవసరమైతే వెంటనే అధికారులను సంప్రదించాలని సూచించారు.

EXTREME RAINFALL ALERT 

SPECIAL WARNING FOR KAMAREDDY ⚠️ 

SEVERE RAINS to gradually reduce in Bhiknoor, Kamareddy local, Domakonda, Rajampet. It will further cover Lingapet, Yellareddy, Gandhari, Nizamsagar, Banswada, Pitlam next 3-4hrs ⚠️

MASSIVE DOWNPOURS also ahead in…

— Telangana Weatherman (@balaji25_t) August 27, 2025

25
భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం
Image Credit : X/Cyberabad Traffic Police

భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం

మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అనేక చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు మునిగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల రైలు పట్టాలు దెబ్బతిన్నాయి. దీంతో రైళ్లను రద్దు చేయాల్సి వచ్చింది. కార్లు, బైక్‌లు వరదలో కొట్టుకుపోయిన ఘటనలు వైరల్ గా మారాయి.

RAILWAY TRACK WASHED AWAY AT KAMAREDDY 🤯🤯🌊

ALL TRAINS MOVING TOWARDS KAMAREDDY - NIZAMABAD ROUTE ARE SUSPENDED 

PLEASE NOTE AND PLAN ACCORDINGLY 🙏 pic.twitter.com/VTxfAWiiu6

— Telangana Weatherman (@balaji25_t) August 27, 2025

#Kamareddy 
All the 9 people stranded (on a tanker) at boggugudise (v) yellareddy mandal got rescued by TGSDRF & @sp_kamareddy team .. timely presence of SDRF in coordination with police & dist Admn 👏🏻
More than 30 cms rains recd in Kamareddy & Medak in last 24 hrs pic.twitter.com/dZUS1xyE0m

— Arvind Kumar (@arvindkumar_ias) August 27, 2025

Related Articles

Related image1
తెలంగాణలో క్లౌడ్ బరస్ట్ ... కేవలం 14 గంటల్లోనే ఎన్ని మిల్లిమీటర్ల వర్షం కురిసిందో తెలుసా?
Related image2
September Holidays : వచ్చేనెలలో స్కూళ్లు, కాలేజీలకు 14 రోజులు సెలవులే... ఇవి ఇంకా పెరగొచ్చు, ఎందుకో తెలుసా?
35
కామారెడ్డి, మెదక్‌లో వర్ష బీభత్సం
Image Credit : Getty

కామారెడ్డి, మెదక్‌లో వర్ష బీభత్సం

కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 31.93 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అనేక ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలు కూడా వర్షాలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. 

పరిస్థితిని పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కలెక్టర్లను అప్రమత్తం చేసి, వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

మునిగిపోయిన కామారెడ్డి GR కాలనీ.. ఏకంగా మొదటి అంతస్తులోకి వస్తున్న వరద నీరు @balaji25_tpic.twitter.com/STex8qr8gn

— Jagan Reddy (@JaganReddyBRS) August 27, 2025

45
హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. ఐఎండీ ఆరెంజ్ అలర్ట్
Image Credit : Getty

హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. ఐఎండీ ఆరెంజ్ అలర్ట్

ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ నగరానికి ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 

రాబోయే మూడు గంటల్లో నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. లోతట్టు ప్రాంత వాసులను అప్రమత్తం చేశారు.

55
మరో ఐదు రోజులు తెలంగాణలో వర్షాలు
Image Credit : GETTY

మరో ఐదు రోజులు తెలంగాణలో వర్షాలు

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాలు ప్రకారం.. వచ్చే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలపై వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

శుక్రవారం, శనివారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అలాగే, భారీ ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా హెచ్చరించింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. సహాయక బృందాల సూచనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
అనుముల రేవంత్ రెడ్డి
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved