తాగి ఇంటికి వచ్చి... చిన్న విషయానికి గొడవ పడుతున్నాడని.. ఓ వివాహిత తన భర్త మర్మాంగాలను కోసేసింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

రాజస్థాన్ కి చెందిన షేర్ సింగ్(26), సంతోషిని(24)లకు వివాహం జరిగిన నాలుగేళ్లలోపు వయసుగల ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కాగా.. పది రోజుల క్రితం ఈ దంపతులు ఇద్దరు హైదరాబాద్ కి వచ్చారు. జీవనోపాధి కోసం హైదరాబాద్ లోనే స్థిరపడ్డారు. షేర్ సింగ్.. ఎల్బీనగర్ లోని ఓ మార్బుల్స్ కంపెనీలో పనికి కుదిరాడు.

సంతోషిని.. ఇంట్లో పిల్లలను చూసుకుంటూ జీవనం సాగిస్తోంది. కాగా.. బుధవారం రాత్రి షేర్ సింగ్ మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఆ మద్యం మత్తులో ఏవో చిన్న కారణాలు చెప్పి భార్యను తిట్టడం మొదలుపెట్టాడు.  చిన్న విషయానికి ఇంత రాద్దాంతం చేయడాన్ని తట్టుకోలక పోయింది సంతోషిణి. అంతే కోపంతో కిచెన్ లో కూరగాయాలు కోసే కత్తితో భర్తపై దాడి చేసింది.

అతని మర్మాంగాలను కత్తితో కోసేసింది. కాగా.. ప్రస్తుతం అతను ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడి సమయంలో చిన్నారులు నిద్రలో ఉన్నారని పోలీసులు తెలిపారు. బాధితుడికి ప్రస్తుతం చికిత్స జరగుతోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు సంతోషిని పై కేసు నమోదు చేశారు. అయితే.. ఆమెను ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు.