హైదరాబాద్ పాతబస్తీలో కారు బీభత్సం సృష్టించింది. కమాటిపురాలో రోడ్డుపై వెళ్తున్న యువతి పైకి కారు దూసుకెళ్లింది. కారు వేగంగా ఢీకొట్టడంతో యువతి ఎగిరిపడింది.
హైదరాబాద్ పాతబస్తీలో కారు బీభత్సం సృష్టించింది. కమాటిపురాలో రోడ్డుపై వెళ్తున్న యువతి పైకి కారు దూసుకెళ్లింది. కారు వేగంగా ఢీకొట్టడంతో యువతి ఎగిరిపడింది. దీంతో యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇక, అదే కారు పాదచారులను ఢీకొట్టి దుకాణంలోకి దూసుకెళ్లింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కారు డ్రైవర్ కోసం ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
