హైదరాబాద్ శివార్లలోని దుండిగల్‌లో దారుణం చోటుచేసుకుంది. అర్దరాత్రి ఓ మహిళపై దుండగులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత మహిళ ఇటీవలే షోలాపూర్ నుంచి నగరానికి వచ్చినట్టుగా గుర్తించారు.
హైదరాబాద్ శివార్లలోని దుండిగల్‌లో దారుణం చోటుచేసుకుంది. అర్దరాత్రి ఓ మహిళపై దుండగులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత మహిళ ఇటీవలే షోలాపూర్ నుంచి నగరానికి వచ్చినట్టుగా గుర్తించారు. వివరాలు.. బాధిత మహిళ రెండు రోజులు క్రితం ఉపాధి నిమిత్తం షోలాపూర్ నుంచి హైదరాబాద్‌క వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి నలుగురు యువకులు ఆమెను గండిమైసమ్మలోని బార్ వెనక ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి సామూహికంగా లైంగిక దాడి చేశారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహిళపై దాడికి పాల్పడిన నిందితులను దుండిగల్ పీఎస్ ఎదురుగా ఉండే బస్తీలో ఉండే ఇమామ్, కుద్దుస్, ఉమృద్ధిన్, నరసింహగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక, నలుగురు నిందితులు ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారని పోలీసులు చెప్పారు.
ఏపీలో బాలికపై అత్యాచారం..
ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో దారుణం చోటుచేసుకుంది. మహిళతో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి.. ఆమె కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను బెదిరించి పదినెలల పాటుగా ఈ ఘాతుకానికి పాల్పడుతూ వచ్చాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. కోమటి సురేష్ అనే వ్యక్తి బాలిక తల్లితో సహజీవనం చేస్తున్నాడు. తండ్రి స్థానంలో ఉన్న అతడు బాలికతో మృగంలా ప్రవర్తించాడు. బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే బాలిక గర్భం దాల్చింది.
గర్భంతో ఉన్న బాలికను బంధువులు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా.. ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు కోమటి సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు డ్రైవర్‌గా పనిచేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.
