హైదరాబాద్: హైద్రాబాద్‌లోని చిలకలగూడ గీతా నర్సింగ్‌ హోంలో హేమలత, లక్ష్మణ్ దంపతులకు ఒకే కాన్పులో నలుగురు  పిల్లలు పుట్టారు. వీరిలో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.

ఈ నెల 2వ తేదీన  విద్యానగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో హేమలత డెలీవరీ కోసం చేరింది. నెలలు నిండకముందే ఆమె డెలీవరీ అయింది.  పుట్టిన సమయంలో ఈ నలుగురు పిల్లలు తక్కువ బరువున్నారు. 

దీంతో వీరికి చికిత్స అందించారు.  ప్రస్తుతం ఆ శిశువులు 1.3, 1.4 కిలోల బరువుతోఆరోగ్యంగా ఉన్నారని  ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.  ఈ నలుగురు పిల్లలు తల్లి పాలు తాగుతున్నారని  ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.