అతనికి మంచి కుటుంబం ఉంది.. చక్కని చదువుంది. వేలల్లో జీతం వచ్చే మంచి ఉద్యోగం ఉంది.. ఇక పెళ్లి చేసుకుంటే.. హాయిగా,ప్రశాంతంగా మరింత ఆనందంగా జీవితాన్ని గడపొచ్చు అని కలలుగన్నాడు. కెరిర్ లో సెటిల్ అయిన నాటి నుంచి తనకు పెళ్లి చేయమని తన పేరెంట్స్ ని కోరుతూనే ఉన్నాడు. 

దాదాపు సంవత్సరకాలంగా తనకు పెళ్లి కావాలని.. సంబంధాలు చూడండి అంటూ పేరెంట్స్ ని పోరు పెడుతూనే ఉన్నాడు. అయితే... చెల్లిపెళ్లి కానీ.. తర్వాత నీకు చూద్దామన్నారు. అంతే.. మనస్థానానికి గురై తనువు చాలించాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. రామాంతపూర్ లోని శారదానగర్ కి చెందిన  పంజాలా నిఖిల్ గైడ్(24) ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు ఐదెంకల జీతం సంపాదిస్తున్నాడు. అయితే ఇంకా పెళ్లి కాలేదు. తనకు పెళ్లి యవసు దాటిపోతోందని అతని వాదన. ఇంకా అంత తొందరపడాల్సిన పనిలేదు. సమయం ఉందిలే అని పేరెంట్స్ వాదన.

Also Read రెండో పెళ్లి... కన్నకూతురిపై అత్యాచారయత్నం...

అయితే.. అతనికి మాత్రం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలని చాలా ఆశగా ఉండేది. అతని అక్కకి పది సంవత్సరాల క్రితమే పెళ్లి జరిగింది. ఇంకో చెల్లి ఉంది. ఆమెకు పెళ్లి జరిగిన తర్వాత నీకు చేస్తామంటూ అతని వాదనను సంవత్సరకాలంగా పేరెంట్స్ కొట్టిపారేస్తూ వస్తున్నారు. అయితే.. తన బాధను పేరెంట్స్ అర్థం చేసుకోలేకపోతున్నారని మదనపడ్డాడు.

మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన తల్లి చీర తో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బయటకు వెళ్లివచ్చిన అతని తల్లిదండ్రులు ఎన్నిసార్లు తలుపుకొట్టినా తెరవకపోయేసరికి అనుమానం కలిగింది. బలవంతంగా డోర్లు పగలకొట్టి చూసేసరికి.. ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించాడు వెంటనే కిందకు దింపి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా... నిఖిల్ తండ్రి ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కాగా.. ప్రస్తుతకాలంలో యువత చాలా సున్నితంగా ఉంటున్నారని.. కావాల్సింది దొరకకపోతే తట్టుకోలేకపోతున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. తమకు కావాల్సింది దొరకకపోతే ఒత్తిడి గురై.. ఇలా బలవన్మరణాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. కాగా.. నిఖిల్ మరణానికి నిజంగా ఇదే కారణమా లేక ఇంకేమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.