Asianet News TeluguAsianet News Telugu

Hyderabad Rains: నగరంలో నేడు భారీ నుండి అతిభారీ వర్షాలు... వాతావరణ శాఖ హెచ్చరిక

తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు వర్షం ముప్పు పొంచివుందని బేగంపేటలోని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ నగరంలో భారీ నుండి అతిభారీ వర్షం కురిసే అవకాశం వుందని హెచ్చరించింది. 

Hyderabad Weather Forecast... heavy rain chance in city
Author
Hyderabad, First Published Sep 29, 2021, 12:48 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు ఇంకా వర్షం ముప్పు పొంచివుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్ 24గంటల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయని... దీని ప్రభావంతో ఇవాళ(బుధవారం) నగరంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. నగర ప్రజలు అవసరమైతే తప్ప ఇంట్లోంచి బయటకు రావద్దని సూచించారు. 

ఇప్పటికే గులాబ్ తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో జంట జలాశయాలతో పాటు హుస్పెన్ సాగర్ నిండుకుండలా మారింది. మూసీ నది వరదనీటితో ఉప్పొంగి ప్రవహిస్తోంది. అలాగే నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగి ప్రజల ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో జిహెచ్ఎంసీ, విపత్తుస్పందనా దళం, రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమయ్యింది.  

read more  Cyclone Gulab : తెలంగాణపై ‘గులాబ్’ ప్రభావం తగ్గింది.. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం

మంగళవారం నగరంలోని సులేమాన్‌ నగర్‌లో 1.4 సెంటీమీటర్లు, మాదాపూర్, బోరబండ, చర్లపల్లి, శ్రీనగర్‌ కాలనీల్లో అరసెంటీమీటరు మేర వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో నిన్న రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించినప్పటికి నగరంలో భారీ వర్షాలు కురవలేమీ కురవలేదు.   

నిన్నటి నుండి వర్ష తీవ్రత తగ్గినప్పటికీ హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌ జలాశయాల గేట్లను ఎత్తి వేయడంతో మూసీకి వరద పోటెత్తుతోంది. చాదర్‌ఘాట్‌, మూసారాం బాగ్‌ వద్ద వంతెనలను ఆనుకుని మూసీ ప్రవహిస్తోంది. మూసారాం బాగ్‌ వంతెనతో పాటు చాదర్‌ఘాట్‌ చిన్న బ్రిడ్జి పైకి రాకపోకలను నిలిపి వేశారు. దీంతో కోఠి-చాదర్‌ఘాట్‌ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ నిలిచి పోయింది.  

ఇక రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డలో అత్యధికంగా 18.13 సెం.మీ వర్షపాతం నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చిట్యాలలో 16.13 సెం.మీ వర్షపాతం రికార్డైంది.సిరిసిల్ల జిల్లా నాంపల్లిలో 15.98 సెం.మీ. వర్షపాతం, ఖమ్మం జిల్లా ఇచ్చోడలో 15.15 సెం.మీ వర్షపాతం నమోదైంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి ధర్మారంలో 14.9 సెం.మీ. జమ్మికుంటలో 14.8 సెం.మీ. వీణవంకలో 14.8 సెం.మీ. వైరాలో 14.2 సెం.మీ హైద్రాబాద్ రాజేంద్రనగర్ లో 11.08 సెం.మీ వర్షపాతం నమోదైంది 
 

Follow Us:
Download App:
  • android
  • ios