Asianet News TeluguAsianet News Telugu

రాజాసింగ్‌ను విడుదల చేయకుంటే ఆందోళ‌న‌ల‌కు దిగుతాం: శ్రీరామసేన హెచ్చరిక‌లు

Hyderabad: స‌స్పెండైన‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇదివ‌ర‌కు అనేక సార్లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు, శాంతికి భంగం క‌లిగించే విధంగా ఒక వ‌ర్గాన్ని రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేశార‌నీ, తాజాగా మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి.. శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించ‌డంతో పాటు ప‌లు కేసుల‌ను ప్ర‌స్తావిస్తూ ఆయ‌న‌పై పోలీసులు పీడీ యాక్ట్ ప్ర‌యోగించారు. ప్ర‌స్తుతం చెర్ల‌ప‌ల్లి జైలు ఉంచారు.
 

Hyderabad : We will stage massive protests if Raja Singh is not released: Shri Ramasena warns
Author
First Published Sep 13, 2022, 5:02 PM IST

Akhil Bhartiya Shriram Sena: స‌స్పెండైన‌ బీజేపీ నాయ‌కుడు, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను పది రోజుల్లోగా విడుదల చేయాలనీ, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అఖిల భారతీయ శ్రీరామ సేన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాజ‌సింగ్ ను విడుద‌ల చేయ‌కుంటే పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగుతామ‌ని హెచ్చ‌రించింది. చర్లపల్లిలోని సెంట్రల్ జైలు నుంచి రాజాసింగ్‌ను విడుదల చేయకుంటే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని అఖిల భారతీయ శ్రీరామ సేన జాతీయ అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ అన్నారని సియాసత్ నివేదించింది.

“పది రోజుల్లో రాజాసింగ్‌ను విడుదల చేయకుంటే మా క్యాడర్  తో హైదరాబాద్‌ను ముట్టడి చేస్తాం. రాజా సింగ్‌ను విడుదల చేయాలనే డిమాండ్‌కు మద్దతుగా లక్షలాది మంది తరలివస్తారు. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది” అని ముతాలిక్ హెచ్చరించారు. జైల్లో ఉన్న రాజాసింగ్‌ను కలవడానికి జైలు అధికారులు ఎవరినీ అనుమతించడం లేదని ఆయన ఫిర్యాదు చేశారు. "అతను ఒక ఉగ్రవాదా? అతన్ని కలవడానికి ఎవరినీ ఎందుకు అనుమతించరు?" అని ముతాలిక్ ప్రశ్నించారు.

రాజా సింగ్‌పై ప్రభుత్వం చట్టవిరుద్ధంగా పీడీ యాక్ట్‌ ప్రయోగించిందని, దానిని సంస్థ ఖండిస్తున్నదని ఆయన అన్నారు. ‘‘జైలులో ఎమ్మెల్యేకు ఎలాంటి సక్రమ సౌకర్యాలు కల్పించలేదు. ఒక ఎమ్మెల్యేను ఈ విధంగా జైలుకు పంపితే, రాజా సింగ్ విడుదల కోసం దేశంలోని హిందువులందరినీ ఏకం చేసి పోరాటం చేస్తాం' అని ప్రమోద్ ముతాలిక్ అన్నారు. హిందూ దేవుళ్లను కించపరిచే వ్యాఖ్యలు చేసిన వ్యక్తి (మునావర్ ఫరూఖీ)పై ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. “హైదరాబాద్ భారత్‌లో భాగమా లేక పాకిస్థాన్‌లో భాగమా?  అని ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. రాజా సింగ్‌కు ఏదైనా జరిగితే హిందూ సమాజం మనోభావాలు శాంతించలేవు” అని ప్రమోద్ ముతాలిక్ అన్నారు.

కాగా, స‌స్పెండైన‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇదివ‌ర‌కు అనేక సార్లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు, శాంతికి భంగం క‌లిగించే విధంగా ఒక వ‌ర్గాన్ని రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేశార‌నీ, తాజాగా మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి.. శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించ‌డంతో పాటు ప‌లు కేసుల‌ను ప్ర‌స్తావిస్తూ ఆయ‌న‌పై పోలీసులు పీడీ యాక్ట్ ప్ర‌యోగించారు. ప్ర‌స్తుతం చెర్ల‌ప‌ల్లి జైలు ఉంచారు.  ఇటీవ‌ల ఒక యూట్యూబ్ ఛాన‌ల్ లో విడుద‌ల చేసిన ఒక వీడియోలో మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై రాజాసింగ్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ముస్లిం వ‌ర్గాల నుంచి పెద్దఎత్తున వ్య‌తిరేక‌త వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌పై ప‌లుచోట్ల కేసులు న‌మోద‌య్యాయి.

దీంతో పోలీసులు రాజాసింగ్ ను అరెస్టు చేశారు. అయితే, కోర్టు ఆయ‌న‌కు బెయిల్ మంజురు చేయ‌డంతో హైద‌రాబాద్ లోని పాత‌బ‌స్తీలో పెద్దఎత్తున ఆందోళ‌న‌లు మ‌ళ్లీ చెల‌రేగాయి. ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. బీజేపీపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఒక వ‌ర్గాన్ని రెచ్చ‌డొడుతూ రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుతున్న‌ద‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇటీవ‌ల మ‌రో బీజేపీ నాయ‌కులు నుపూర్ శ‌ర్మ వ్యాఖ్య‌లు సైతం గుర్తు చేస్తూ బీజేపీకి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు కొన‌సాగాయి. దీంతో బీజేపీ రాజాసింగ్ ను పార్టీ నుంచి తాత్కాలికంగా స‌స్పెండ్ చేసింది. ఆ వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ‌ను కొరింది. ఇదివ‌ర‌కే రాజాసింగ్ భార్య బీజేపీ కూడా లేఖ రాశారు. వివ‌రణ ఇవ్వ‌డానికి మ‌రింత స‌మ‌యం కోరారు. అలాగే, పీడీ యాక్ట్ ప్ర‌యోగించ‌డంపై కూడా ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించారు.

Follow Us:
Download App:
  • android
  • ios