ఇంటర్ విద్యార్థిని.. ఓ యువకుడిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించింది. అతనినే పెళ్లి చేసుకోవాలని ఆశపడింది. అయితే... ఆమె పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. తల్లిదండ్రులను ఎంత బ్రతిమిలాడినా.. తన ప్రేమను అంగీకరించకపోవడంపై సదరు యువతి నిరాశకు గురైంది. అలా అని ప్రేమించిన వాడిని వదులుకోలేకపోయింది. దీంతో మనస్థాపానికి గురై ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బీహెచ్ఈఎల్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... బీహెచ్ఈఎల్ టౌన్ షిప్ కి చెందిన సంతోషి(19) ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. కాగా... యువతి తన బంధువైన ఓ యువడిని ప్రేమించింది. అయితే... అతనితో ప్రేమకు కుటుంబసభ్యులు అంగీకరించలేదు. మరో యువకుడితో పెళ్లి కుదిర్చారు.

దీంతో... తన ప్రేమను కాదన్నందుకు యువతి మనస్థాపానికి గురైంది. శనివారం రాత్రి... తల్లిదండ్రులు చూడని సమయంలో ఇంట్లో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.