Asianet News TeluguAsianet News Telugu

హైద‌రాబాద్: ఇద్ద‌రు మ‌హిళా జ‌ర్న‌లిస్టుల‌ను ఢీకొన్న కారు.. ఒక‌రు మృతి

Hyderabad: హయత్ నగర్ లో కారు ఢీకొని ఓ జర్నలిస్ట్ మ‌ర‌ణించ‌గా, మరో జర్నలిస్ట్ ప్రాణాల‌తో పోరాడుతున్నారు. రోడ్డు దాటుతుండగా వేగంగా వ‌చ్చిన కారు ఇద్ద‌రు మ‌హిళ జ‌ర్న‌లిస్టుల‌ను ఢీ కొట్టింది. ఒక‌రు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉందనీ, హైదరాబాద్ లోని ఓ  ప్ర‌యివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు.
 

Hyderabad : Two women journalists were hit by a car.. One died.
Author
First Published Nov 21, 2022, 11:13 PM IST

Women Journalists: తెలంగాణలో వేగంగా వస్తున్న ఒక కారు ఇద్ద‌రు మ‌హిళా జ‌ర్న‌లిస్టుల‌ను ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రోక‌రు తీవ్ర గాయాల‌తో ఒక ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు అని ఇండియా టూడే నివేదించింది. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న మహిళ ప‌రిస్థితి కూడా ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. సంబంధిత క‌థ‌నం ప్ర‌కారం..  నవంబర్ 18వ తేదీ ఉదయం 5:15 గంటల ప్రాంతంలో హయత్‌నగర్ వద్ద ఇద్దరు మహిళా జర్నలిస్టులు రోడ్డు దాటుతుండగా వేగంగా  వచ్చిన కారు ఢీ కొట్టింది.

ఈ ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో మహిళ పరిస్థితి విషమంగా ఉందని, హైదరాబాద్ లోని ఒక ప్ర‌యివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని తెలిపారు. వారు తమ కార్యాలయానికి వెళ్తుండగా వేగంగా వచ్చిన వాహనం అదుపుతప్పి వారిద్దరినీ ఢీకొట్టిందని స‌మాచారం. ఈ ప్ర‌మాదం గురించి హయత్‌నగర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. "నవంబర్ 18న తెల్లవారుజామున 5:15 గంటల ప్రాంతంలో భాగ్యలత కమాన్ వద్ద తమ కార్యాలయం వైపు రోడ్డు దాటుతుండగా ఇద్దరు మహిళా జర్నలిస్టులను కారు ఢీకొట్టింది. ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది. గాయ‌ప‌డిన మ‌హిళ‌ను కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇండికా కారు డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ఘటనకు దారితీసిందని ప్రాథమిక విచారణలో తేలింది" అని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామ‌ని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios