Asianet News TeluguAsianet News Telugu

కోరిక తీర్చ‌చ‌లేద‌ని మహిళ గొంతు కోసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే పీఏ.. కేసు నమోదు..

Hyderabad: మహిళపై దాడికి పాల్పడిన టీఆర్ఎస్ నేతపై ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధితురాలు ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ద‌నీ, ఈ ఘ‌టన‌పై పూర్తి స్థాయి విచార‌ణ జ‌రుగుతున్న‌ద‌ని పోలీసులు తెలిపారు. 
 

Hyderabad : TRS MLA's PA slits woman's throat; A case has been registered.
Author
First Published Sep 19, 2022, 3:44 PM IST

Jubilee Hills: త‌న కొరిక తీర్చ‌డానికి రావాల‌ని కోర‌గా.. దీనికి  మ‌హిళ అంగీక‌రించ‌క‌పోవ‌డంతో అధికార పార్టీకి చెందిన ఓ నాయ‌కుడు గొంతు కోశాడు. ఈ దారుణ ఘ‌ట‌న హైద‌రాబాద్ లో చోటుచేసుకుంది. బాధితురాలు ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ద‌నీ, ఈ ఘ‌టన‌పై పూర్తి స్థాయి విచార‌ణ జ‌రుగుతున్న‌ద‌ని పోలీసులు తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) కి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే పర్సనల్ అసిస్టెంట్ (పీఏ) విజయసింహ ఆదివారం రాత్రి బేగంపేటలోని బీఎస్ మక్తాలో ఉన్న ఓ వివాహిత ఇంటికి వెళ్లి ఆమెను తనతో రావాలని కోరాడు. అయితే, దానికి నిరాక‌రించిన ఆమెపై దాడి చేసి ఆమె గొంతు కోశాడ‌ని బాధిత కుటుంబం ఆరోపించింది.  ఈ ఘటన హైదరాబాద్‌లోని పంజాగుట్ట ప్రాంతంలో చోటుచేసుకుంది. నిషా (35) అనే మహిళ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ప‌రిస్థితి ఇంకా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 448, 324, 354(ఎ) 506 ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసు నమోదు చేసినట్లు పంజాగుట్ట పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ హరీశ్ చంద్రారెడ్డి తెలిపార‌ని ఇండియా టూడే నివేదించిది. నిషా మెడపై కోసిన గుర్తులతో నొప్పితో  ఆమె బాధ‌ప‌డుతున్న వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో పోలీసులు ఈ చ‌ర్య‌లు తీసుకున్నారు. 

సోమవారం తెల్లవారుజామున విజయసింహారెడ్డి తన భార్య గొంతు కోసేందుకు ప్రయత్నించాడని మహిళ భర్త పేర్కొన్నాడు. "పోలీసులు కూడా ఉన్న ఆసుపత్రిలో ఆమె నాకు రెండు మూడు సార్లు కాల్ చేసింది. దాడి చేసిన వ్యక్తి జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే పీఏ విజయ్ సిన్హా అని ఆమె పేర్కొంది' అని ఆమె భర్త తెలిపారు. సిన్హా తన భార్యకు స్నేహితంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడనీ, రోజుకు చాలాసార్లు ఆమెకు ఫోన్ చేసేవాడని పేర్కొన్నాడు. "అతను నా భార్య నంబర్‌కు చాలాసార్లు కాల్ చేసేవాడు. వారి మధ్య కాల్ రికార్డ్‌లు నేను విన్నాను. అతను న్యూడ్ వీడియో కాల్స్ చేసేవాడు.. వేధించేవాడు" అని పేర్కొన్నాడు. అయితే, త‌మ ఇంటి అడ్ర‌స్ క‌నుక్కొని  ఇలాంటి దాడికి పాల్ప‌డ‌తాడ‌ని తాము ఊహించ‌లేద‌ని తెలిపాడు. ఇప్పుడు ఆమె ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌నీ, ఇంకా అపస్మారక స్థితిలో ఉందని పేర్కొన్నాడు. అలాగే, అత‌నికి ఎమ్మెల్యేతో ద‌గ్గ‌రి సంబంధాలు ఉన్నాయ‌నీ, నిందితుడి తో త‌మ ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 

అయితే, త‌న‌ను ఇరికించ‌డానిక ఇట్ర జ‌రిగింద‌ని నిందితుడు సిన్హా చెప్పిన‌ట్టు ఇండియా టూడే నివేదించింది. అలాగే, 'నేను బోరబండ డివిజన్ టీఆర్‌ఎస్‌ పార్టీ సమన్వయకర్తను. గత ఆరేళ్లుగా మాజీ డిప్యూటీ మేయర్‌, ప్రస్తుత బోరబండ డివిజన్‌ ​​కార్పొరేటర్‌ బాబా ఫసియుద్దీన్‌కు పీఏగా పనిచేశాను. అతడి దోపిడీ కార్యకలాపాలను చూసి.. ఆయనను విడిచిపెట్టి పార్టీ అభివృద్ధికి కృషి చేశాను. అతను (బాబా ఫసియుద్దీన్) కుట్ర ప‌న్నాడు. నాపై కేసు పెట్టడానికి వారికి (మహిళ- ఆమె భర్త) రూ. 3 లక్షలు ఇచ్చాడని వారం క్రితం నా దృష్టికి వచ్చింది. నిన్న, నేను హత్యాయత్నం చేశానని ఒక వార్త ప్రచారంలో ఉంది. రాత్రి 1 గంటల సమయంలో మహిళలు. ఆ సమయంలో నేను ఎక్కడ ఉన్నాననేదానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్ని వాస్తవాలను పోలీసు శాఖ బయటపెడుతుంది”అని చెప్పుకు రావ‌డం గ‌మ‌నార్హం. 

Follow Us:
Download App:
  • android
  • ios