Hyderabad: బీసీలు ఏకమై అధికారం చేజిక్కించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని బీసీ నాయ‌కుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయనీ, 16 రాష్ట్రాల నుంచి పార్లమెంటులో బీసీలకు ప్రాతినిధ్యం లేదని ఆయ‌న ఆవేదన వ్యక్తం చేశారు. 

BC leader and Rajya Sabha member R Krishnaiah: వెనుకబడిన తరగతులకు ఏ రంగంలోనూ దామాషా ప్రాతినిధ్యం లభించడం లేదనీ, రాజకీయంగా అధికారం చేజిక్కించుకునేందుకు ఆ సామాజికవర్గం మరో ఉద్యమం చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని బీసీ నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. సీలు ఏకమై అధికారం చేజిక్కించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని బీసీ నాయ‌కుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయనీ, 16 రాష్ట్రాల నుంచి పార్లమెంటులో బీసీలకు ప్రాతినిధ్యం లేదని ఆయ‌న ఆవేదన వ్యక్తం చేశారు.

గత 75 ఏళ్లలో చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం 14 శాతం దాటలేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆర్. కృష్ణ‌య్య సంఘం తన ప్రయోజనాల కోసం వనరులను సమకూర్చుకోవడం అత్యవసరమని అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ.. రాజకీయాధికారం సాధించేందుకు బీసీ సంఘాలన్నీ ఉద్యమానికి పెద్దపీట వేయాలని పిలుపునిచ్చారు. ఇతరత్రా పనికిమాలిన విషయాలకు సమయాన్ని, శక్తిని వృధా చేసుకోవద్దని ఆయ‌న‌ సూచించారు. జాతీయ సంపదను ఉత్పత్తి చేయడంలో బీసీలు ముందున్నారని, అయితే అందులో వారికి త‌గిన ప్రాధాన్య‌త ల‌భించ‌డం లేద‌ని అన్నారు. 

“మేము ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నాము, కానీ రాజకీయ అధికారంలో బీసీల‌కు స‌రైన‌ వాటా లేదు. అగ్రవర్ణాలు బీసీలను అణచివేసాయి. ఈ దేశంలోనే 56 శాతం జనాభా ఉన్న బీసీలకు రాజ్యాంగ హక్కులు కాలరాయబడ్డాయి” అని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయని అన్నారు. 16 రాష్ట్రాల నుంచి పార్లమెంట్‌లో బీసీ ప్రాతినిధ్యం లేదని ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలుంటే కేవలం 21 మంది మాత్రమే బీసీలు ఉన్నారని అన్నారు. 

ఇదిలావుండ‌గా, క‌రెన్సీ నోట్ల‌పై రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్.అంబేద్క‌ర్ ఫొటో అంశం గురించి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని డిమాండ్ చేసిన ఆర్ కృష్ణ‌య్య, నూతన పార్లమెంట్‌కు అంబేద్క‌ర్ పేరు పెట్టాలని అన్నారు. గ‌త వారం కరెన్సీపై అంబేడ్కర్‌ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురామ్, జాతీయ సలహాదారు ఆళ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో దేశ‌రాజ‌ధాని ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఒక కార్య‌క్ర‌మం నిర్వహించారు. ఆర్ కృష్ణ‌య్య సైతం ఇందులో పాలుపంచుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.