శ్రీకృష్ణ పరమాత్ముడు మానవాళికి అందించిన అద్భుత బహుమతి భగవద్గీత. మానవ జీవిత గమనానికి అవసరమైన అన్ని కోణాలను స్పృశించి ప్రతి సమస్యకు పరిష్కారం చూపే గ్రంథ రాజమే. శ్రీమద్‌ భగవద్గీత. మానవ జీవిత గమనానికి అవసరమైన అన్ని కోణాలను స్పృశించి ప్రతి సమస్యకు పరిష్కారం చూపే గ్రంథ రాజమే శ్రీమద్‌భగవద్గీత.

యువతి బియ్యపు గింజలపై భగవద్గీతను కేవ‌లం 150 గంట‌ల్లోనే భగవద్గీత రాసి రికార్డ్ సృష్టించింది. హైద‌రాబాద్‌కు చెందిన రామగిరి స్వారిక అనే లా స్టూడెంట్ ఈ అరుదైన ఘ‌న‌త‌ను సాధించి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకొంటుంది.  భగవద్గీత 18 అధ్యాయాల్లోని 700 శ్లోకాలను మొత్తం 36,378 అక్షరాలతో కూడిన 9,839 పదాలతో 4,042 బియ్యపు గింజలపై రాశారు.

చిన్న‌త‌నం నుంచే త‌న‌కు క‌ళ‌ల‌పై ఆసక్తి ఎక్కువని గ‌త కొన్నేళ్లుగా మైక్రో ఆర్ట్ చేస్తున్నాన‌ని వివ‌రించింది. 2017లో ఒకే బియ్యపు గింజపై ఆంగ్ల అక్షరమాల రాసినందుకు గాను అత్యత్తుమ మైక్రో ఆర్టిస్ట్‌గా అంత‌ర్జాతీయ వ‌ర‌ల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్వారిక చోటు సంపాదించుకున్నారు.

స్వారిక ప్ర‌తిభ‌కు గానూ గతేడాది నార్త్ ఢిల్లీ కల్చరల్ అసోసియేషన్  రాష్ట్రీయ పురస్కార్‌ను ప్రధానం చేసింది. ఇప్ప‌టివ‌ర‌కు వెయ్యికి పైగా మైక్రో డిజైనింగ్ చేసి ప‌లు స‌త్కారాలు అందుకొంది.