హైదరాబాద్ బంజారాహిల్స్‌లో భారీగా హవాలా డబ్బు బయటపడింది. సుమారు రూ.3.5 కోట్లను పట్టుకున్నట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ మంగళవారం మీడియాకు వివరాలు అందజేశారు.

ఇందుకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది... ఎవరెవరి చేతులు మారిందన్న అంశంపై ఆదాయపుపన్ను శాఖ అధికారుల దర్యాప్తు చేస్తారని సీపీ పేర్కొన్నారు.

పట్టుబడిన నిందితులను సైతం ఐటీ కస్టడీకి అప్పగిస్తామని అంజనీ కుమార్ వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులను ఆయన అభినందించారు.