2006 నుంచి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతూ దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్న కరడుగట్టిన దొంగ ఫైజల్ షా అలీని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను 2006 నుంచి 135 చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు.
హైదరాబాద్‌లో (hyderabad) చైన్ స్నాచింగ్‌లకు (chain snatching) పాల్పడుతున్న కరడుగట్టిన దొంగ ఫైజల్ షా అలీని (faisal shah ali) అరెస్ట్ చేశారు సౌత్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు. రిసీవల్ ఖలీల్ అనే మరో నిందతుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫైజల్ అలీపై గతంలో శాలిబండ, నారాయణ గూడ, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో మూడు చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. గతంలోనూ రెండు సార్లు పీడీ యాక్ట్‌పై జైలుకు వెళ్లొచ్చాడు. ఫైజల్ నుంచి లక్షా 80 వేల రూపాయల విలువ చేసే 120 గ్రాముల గోల్డ్ చైన్ ఒక పల్సర్ బైక్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఇతనికి 2006 నుంచి నేర చరిత్ర వుందని.. పలు పోలీస్ కమీషనరేట్ల పరిధిలో 135 చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు.
