హైద‌రాబాద్ స్పెష‌ల్.. దుమ్ములేపుతున్న బిర్యానీ, హ‌లీం ఆర్డ‌ర్లు !

Hyderabad: రంజాన్ సందర్భంగా స్విగ్గీలో నగరవాసులు 1 మిలియన్ బిర్యానీలను ఆర్డర్ చేసినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ఆన్-డిమాండ్ కన్వీనియన్స్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ మార్చి 23 నుండి ఏప్రిల్ 18 వరకు అందుకున్న ఆర్డర్లను విశ్లేషిస్తే, రంజాన్ వేడుకలకు కేంద్ర బిందువైన హలీమ్ కు 4 లక్షలకు పైగా ఆర్డర్లు వచ్చాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే బిర్యానీ ఆర్డర్ల సంఖ్య 20 శాతం పెరిగింది. 
 

Hyderabad special, Biryani and Haleem orders creating records Ramzan RMA

Hyderabad special, Biryani and Haleem: హైద‌రాబాద్ లో రంజాన్ వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఇదే స‌మ‌యంలో భాగ్య‌న‌గ‌రం స్ఫెష‌ల్ హైద‌రాబాద్ బిర్యానీ, హ‌లీమ్ అమ్మ‌కాలు సైతం కొత్త రికార్డులు నెల‌కోల్పుతున్నాయి. రంజాన్ సందర్భంగా నగరంలో ఒక మిలియ‌న్ బిర్యానీ,  4 ల‌క్ష‌ల హలీమ్ ఆన్ లైన్ ఆర్డర్లు వ‌చ్చాయి. రంజాన్ సందర్భంగా హలీమ్, చికెన్ బిర్యానీ, సమోసా వంటి సంప్రదాయ వంటకాలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. ఈ క్ర‌మంలోనే సంబంధిత వంట‌కాల ఆర్డ‌ర్లు క్ర‌మంగా పెరుగుతున్నాయ‌ని విక్రేత‌లు చెబుతున్నారు. 

ఈ రంజాన్ సందర్భంగా స్విగ్గీలో నగరవాసులు 1 మిలియన్ బిర్యానీలను ఆర్డర్ చేసినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ఆన్-డిమాండ్ కన్వీనియన్స్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ మార్చి 23 నుండి ఏప్రిల్ 18 వరకు అందుకున్న ఆర్డర్లను విశ్లేషిస్తే, రంజాన్ వేడుకలకు కేంద్ర బిందువైన హలీమ్ కు 4 లక్షలకు పైగా ఆర్డర్లు వచ్చాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే బిర్యానీ ఆర్డర్ల సంఖ్య 20 శాతం పెరిగింది. 

అత్యంత ప్రజాదరణ పొందిన ఇఫ్తార్ విందులో ఉండే సమోసాలు, భజియాలతో పాటు ఖర్జూరాలతో చేసిన వంటకాలు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. భజియాలకు ఆర్డర్లు 77 శాతం పెరిగాయి. నగరానికి ఇష్టమైన మటన్ హలీంతో పాటు చికెన్, పాలమూరు పోటెల్, పర్షియన్ స్పెషల్ హలీమ్, డ్రై ఫ్రూట్ హలీమ్ సహా మరో తొమ్మిది రకాల హలీమ్లకు డిమాండ్ మరింతగా పెరిగింది. మాల్పువా, ఫిర్నీ, రబ్డీ వంటి ఫెస్టివల్ స్పెషల్ డెజర్ట్స్ ఆర్డర్లు 20 శాతం పెరిగాయి.

పిస్తా హౌస్ హలీం, ప్యారడైజ్ బిర్యానీ, మెహ్ఫిల్ వంటి రెస్టారెంట్లు ఇఫ్తార్ విందులో హైదరాబాద్ ఫేవరెట్లుగా నిలిచాయని స్విగ్గీ నివేదిక తెలిపింది. స్విగ్గీతో పాటు జోమాటో ఇతర ఆన్ లైన్ ఫుడ్ సర్వీసులు అందిస్తున్న సంస్థలు సైతం ఇదే తరహా ఆర్డర్లను అందుకుంటున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. రంజాన్ సందర్భంగా దొరికే స్పేషల్ వంటకాలను మీరు ట్రై చేయండి మరీ.. ! 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios