విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అపార్ట్ మెంట్ లోని ప్లాట్ నెంబర్ 201లో దాడి చేసి వ్యభిచార గృహం నిర్వాహకుడు కుత్బుల్లాపూర్ కు చెందిన ఎండీ అజీజ్, నిజాం పేటకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన విటుడు సుబ్రహ్మణ్యంతో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ : రాధాస్వామి కాలనీ రాక్ ప్రైడ్ apartmentలో గుట్టుగా సాగుతున్న
Prostitution gang గుట్టు రట్టు చేశారు బోయిన్ పల్లి పోలీసులు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అపార్ట్ మెంట్ లోని ప్లాట్ నెంబర్ 201లో దాడి చేసి వ్యభిచార గృహం నిర్వాహకుడు కుత్బుల్లాపూర్ కు చెందిన ఎండీ అజీజ్, నిజాం పేటకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన విటుడు సుబ్రహ్మణ్యంతో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల నుంచి రూ.4వేల నగదు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అజీజ్ తో పాటు ప్రదీప్ అనే మరో వ్యక్తి వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడయ్యింది.
ఇదిలా ఉండగా, హైదరాబాద్ లో ఇటీవలి కాలంలో వ్యభిచార ముఠాలు ఎక్కువవుతున్నాయి. గత నవంబర్ లో మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ సెంటర్ మీద టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. మసాజ్ సెంటర్ నిర్వాహకులతో పాటు ఒక విటుడిని, పలువురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. Task Force Police తెలిపిన వివరాల ప్రకారం.. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12లో కొందరు ‘ఎలిగంట్ బ్యూటీ స్పాలూన్, అథర్వ హమామ్ స్పా’ పేర్లతో మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు.
అయితే, ఈ కేంద్రాల్లో Prostitution నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి Attacks జరిపారు. మసాజ్ సెంటర్ నిర్వాహకలుతో పాటు ఒక విటుడు, పలువురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నిమిత్తం బంజారాహిల్స్ పోలీసులకు నిందితులను అప్పగించారు.
హైద్రాబాద్‌లో 'గ్యాంగ్' సినిమా తరహలోచోరీ: ముగ్గురు నకిలీ సీబీఐ అధికారుల అరెస్ట్
ఇలాంటిదే మరో కేసు హైదరాబాద్ లో నవంబర్ 26న వెలుగులోకి వచ్చింది. పఠాన్ చెరు పరిధిలోని వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. patancheru పరిధిలోని అమీన్ పూర్ నరేంద్రకాలనీలో ఓ అపార్ట్ మెంట్ లో ప్లాట్ ను అద్దెకు తీసుకుని ఓ మహిళ prostitution నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారం అందింది. దీంతో సదరు అపార్ట్ మెంట్ పై నిఘా వుంచిన పోలీసులు వ్యభిచారం జరుగుతున్నట్లు నిర్దారించుకున్నారు. దీంతో వెంటనే ప్లాట్ పై దాడిచేసి నిర్వహకురాలితో పాటు ఇద్దరు యువతులు, మరో ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు.
ఇక ఇదే అమీన్ పూర్ పరిధిలోని పటేల్ గూడ బిహెచ్ఈఎల్ కాలనీలో ఓ ఇంట్లో వ్యభిచార దందా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఇంటిపై దాడిచేసి విటుడితో పాటు యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా పట్టుబడిన brothal house నిర్వహకులతో పాటు విటులపై కేసు నమోదుచేసి రిమాండ్ కు తరలించినట్లు పటాన్ చెరు సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఇక మహిళలను రెస్క్యూ హోంకు తరలించినట్లు వెల్లడించారు.
ఐటీ ఉద్యోగులే టార్గెట్ గా పటాన్ చెరు, లింగంపల్లి ప్రాంతాలపై వ్యభిచార ముఠాలు కన్నేసినట్లు పోలీసులు చెబుతున్నారు. హైటెక్ పద్దతుల్లో IT Employees ను ఆకర్షిస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఐటీ కారిడార్ అయిన హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలన అతి సమీపంలో వుండటం... ఐటీ ఉద్యోగులు ఎక్కువగా నివాసముండటం... శివారు ప్రాంతం కావడంతో పఠాన్ చెరు ప్రాంతంలో వ్యభిచార గృహాలు వెలుస్తున్నాయి.
