గత 24 గంటల్లో హైద్రాబాద్ లో భారీ వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది.

హైదరాబాద్: గత 24 గంటల్లో హైద్రాబాద్ లో భారీ వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది.

2000 ఆగష్టు మాసంలో హైద్రాబాద్ బేగంపేటలో భారీ వర్షపాతం నమోదైంది.ఆ సమయంలో 24 సెం.మీ వర్షపాతం నమోదైంది. గత 24 గంటల్లో 29.8 సెం.మీ వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణశాఖాధికారులు ప్రకటించారు.

హయత్ నగర్, ఘటకేశ్వర్ లలో 32.3 సెం.మీ వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.నగరంలోని 35 ప్రాంతాల్లో 21 సెం.మీ కంటే అధిక వర్షపాతం నమోదైంది. హైద్రాబాద్ లో ఇదే అత్యధిక వర్షపాతంగా అధికారులు చెబుతున్నారు. 

హైద్రాబాద్ బేగంపేటలో అత్యధికంగా వర్షపాతం నమోదైనట్టుగా రికార్డులు చెబుతున్నాయి. గతంతో పోలిస్తే నగరంలో పలు చోట్ల రెయిన్ గేజ్ మీటర్లు ఉన్నాయి. దీంతో వర్షపాతం వివరాలను నమోదు చేస్తున్నారు.మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

భారీ వర్షంతో నగరంలో పలు ప్రాంతాల్లో కాలనీలు నీటిలో మునిగిపోయాయి. అంతేకాదు చాలా కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.