Asianet News TeluguAsianet News Telugu

హయత్‌నగర్ పసుమాముల ఫామ్‌హౌస్ లో రేవ్ పార్టీ: విద్యార్ధులకు గంజాయి సరఫరా, 37 మంది అరెస్ట్

హైద్రాబాద్ నగర శివారులోని  పసుమాములలో రేవ్ పార్టీలో పాల్గొన్న 34 మందిని పోలీసులు అరెస్ట్  చేశారు. అంతేకాదు ఈ పార్టీలో పాల్గొన్న  విద్యార్ధులకు  గంజాయిని  విక్రయిస్తున్న ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Hyderabad Rachakonda police busts Rave party in Hayathnagar
Author
First Published Dec 4, 2022, 10:32 AM IST

హైదరాబాద్: నగరానికి శివారులోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల పసుమాములలోని ఫామ్ హౌస్ లో  బర్త్ డే పార్టీ పేరుతో  రేవ్ పార్టీకి పాల్పడుతున్న వారిని పోలీసులు అరెస్ట్  చేశారు. అంతేకాదు ఈ పార్టీలో  ముగ్గురు గంజాయి విక్రయిస్తున్నవారిని కూడా  పోలీసులు అరెస్ట్  చేశారు.  నగర శివార్లలోని  ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలకు  చెందిన  34 మంది విద్యార్ధులు బర్త్ డే పార్టీ కోసం ఈ ఫామ్  హౌస్  ను బుక్  చేసుకున్నారు. డిసెంబర్  2న బర్త్ డే పార్టీ కోసం  ఫామ్ హౌస్  ను బుక్  చేశారు.  అయితే  ఈ  ఫామ్  హౌస్ లో  బర్త్ డే పార్టీ పేరుతో  రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ సమాచారం ఆధారంగా  పోలీసులు ఫామ్ హౌస్ పై దాడి  చేశారు. ఈ  ఫామ్ హౌస్ లో  34 మంది ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధులతో పాటు ముగ్గురు గంజాయి విక్రేతలను కూడా పోలీసులు అరెస్ట్  చేశారు. మరో వైపు ముగ్గురు విద్యార్ధుల వద్ద  50 గ్రాములల గంజాయిని  కూడా పోలీసులు సీజ్  చేశారు.

మద్యం బాటిల్స్,  గంజాయి ఆనవాళ్లు, విద్యార్ధుల బ్యాగులు, గుర్తింపు కార్డులను పోలీసులు స్వాధీనం  చేసుకున్నారు. ఈ పార్టీలో  పాల్గొన్న ఇద్దరు విద్యార్ధులు పరారీలో  ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్ధులకు చెందిన  30 మొబైల్ ఫోన్లు, 10 కార్లు, ఎనిమిది సిగరెట్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫామ్  హౌస్ ఓనర్ సన్నీకిరణ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

బర్త్ డే పార్టీ పేరుతో  ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధులు రేవ్  పార్టీ నిర్వహించడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.   తమ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో  ఓ కన్నేసి ఉంచాలని పోలీసులు సూచిస్తున్నారు.గతంలో  కూడా  పబ్ లు, ఫామ్ హౌస్ లలో  రేవ్ పార్టీలు నిర్వహిస్తున్న ఘటనలు చోటు  చేసుకున్నాయి. రేవ్  పార్టీల్లో  మత్తు పదార్ధాలను కూడా వాడుతున్న ఘటనలు కూడా లేకపోలేదు. దీంతో  ఫామ్ హౌస్ లు, పబ్ లపై పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు నిఘాను పెంచారు. 

Follow Us:
Download App:
  • android
  • ios