హైద్రాబాద్ లో సినీ ఆర్టిస్టులకు గంజాయి సరఫరా చేస్తున్న సినీ అసిస్టెంట్ డైరెక్టర్ హథిరామ్ ను అరెస్ట్ చేసినట్టుగా రాచకొండ  పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి సరఫరాపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కు పాదం మోపింది.

హైదరాబాద్: హైద్రాబాద్ లో సినీ ఆర్టిస్టులకు గంజాయి సరఫరా చేస్తున్న సినీ అసిస్టెంట్ డైరెక్టర్ Hathi Ram ను రాచకొండ పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు. Karnataka నుండి Hyderabad కు గంజాయి సరఫరా చేస్తున్నారని పోలీసులు తెలిపారు. హథిరామ్ తో పాటు ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కురుక్షేత్రం, యుద్ధం శరణం గచ్చామి సినిమాలకు హథిరామ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. Karnataka నుండి కారులో గంజాయిని హథిరామ్ సరఫరా చేస్తున్నారని పోలీసులు తెలిపారు. హథిరామ్ తో పాటు ఆరుగురిని అరెస్ట్ చేశామని రాచకొండ పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు.హథిరామ్ నుండి 190 కిలోల Ganjaని సీజ్ చేశామన్నారు.

డబ్బుల అవసరాల కోసం హథిరామ్ గంజాయి సరఫరా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. చాలా కాలంగా హథిరామ్ గంజాయి సరఫరా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.ఈ విషయమై కర్చితమైన సమాచారం ఆధారంగా పోలీసులు ఇవాళ హథిరామ్ ను అరెస్ట్ చేశారు.

డ్రగ్స్, గంజాయి సరఫరా చేసే వారిపై తెలంగాణ పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హైద్రాబాద్ నగరంలో పోలీసులు డ్రగ్స్ తో పాటు గంజాయి సరఫరా చేయకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నారు. మత్తు పదార్ధాలు విక్రయించే వారితో పాటు వీటిని కొనుగోలు చేసే వారిపై కూడా తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. హైద్రాబాద్ సీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతానని హెచ్చరించారు. హైద్రాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీవీ ఆనంద్ దేశంలో హైద్రాబాద్ సహా పలు నగరాలకు డ్రగ్స్ సరఫరా చేసే మోస్ట్ వాంటెడ్ టోనిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలో ఉన్న టోనిని హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. టోని ఇచ్చిన సమాచారం మేరకు డ్రగ్స్ తీసుకుంటున్న వ్యాపారులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.