మాదాపూర్ కాల్పుల కేసులో నిందితుల కోసం నాలుగు టీమ్ ల ఏర్పాటు: డీసీపీ సందీప్ రావ్
రియల్ ఏస్టేట్ వివాదం కారనంగాన మాదాపూర్ లో కాల్పులు చోటు చేసుకొన్నాయని బాలానగర్ డీసీపీ సందీప్ రావు చెప్పారు. ఇస్మాయిల్ పై అతి సమీపం నుండి కాల్పులు జరపడంతో అతను మరణించాడు. ఈ ఘటనలో జహంగీర్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి.
హైదరాబాద్: రియల్ ఏస్టేట్ వివాదం కారణంగానే Madhapur లో కాల్పులు చోటు చేసుకొన్నాయని బాలానగర్ డీసీపీ Sanddep Rao చెప్పారు.
మాదాపూర్ లో సోమవారం నాడు తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ఇస్మాయిల్ అనే వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే.ఈ ఘటనకు సంబంధించి Balanagar DCP సందీప్ రావు మీడియా సమావేశంలో వివరించారు. ISmail కు ముజాహీదుద్దీన్ మధ్య గత కొంతకాలంగా వివాదం ఉందని తమ ప్రాథమిక విచారణలో తేలిందని సందీప్ రావు చెప్పారు. Ranga Reddy, జహీరాబాద్ ప్రాంతాల్లో వీరంతా రియల్ ఏస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్నట్టుగా డీసీపీ చెప్పారు. ఇస్మాయిల్ పై అతి సమీపం నుండి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు జరిగాయన్నారు. ఇస్మాయిల్ తో పాటు అక్కడే ఉన్న జహంగీర్ పై కూడా నిందితులు కాల్పులు జరిపినట్టుగా పోలీసులు చెప్పారు.
ఆదివారం నాడు రాత్రి తొమ్మిదిన్నర గంటల నుండి నిందితులుతో పాటు చనిపోయిన ఇస్మాయిల్ కూడా కలిసే ఉన్నారన్నారు. రాత్రి తొమ్మిదిన్నర గంటల నుండి మాసాబ్ ట్యాంక్, బంజారాహిల్స్, పంజాగుట్టల వద్ద తిరిగారని డీసీపీ చెప్పారు సోమవారం నాడు తెల్లవారుజామున పన్నెండున్నర సమయంలో మాదాపూర్ కు చేరుకున్నారని పోలీసులు తెలిపారు. మాదాపూర్ వద్దే సుమారు రెండు గంటల పాటు వీరి మధ్య రియల్ ఏస్టేట్ విషయమై చర్చలు జరిగినట్టుగా పోలీసులు చెప్పారు. అయితే ఈ చర్చలు గొడవకు దారితీశాయని డీసీపీ సందీప్ రావు వివరించారు. ఈ సమయంలోనే ఇస్మాయిల్ పై జిలానీ అనే వ్యక్తి కాల్పులకు దిగాడన్నారు. సుమారు రెండు నుండి మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్టుగా గుర్తించామని డీసీపీ తెలిపారు. ఇస్మాయిల్, జహంగీర్ పై కాల్పులు జరిపిన నిందితులు పారిపోయినట్టుగా ఆయన చెప్పారు. నిందితుల కోసం నాలుగు టీమ్ ల ను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్టుగా డీసీపీ వివరించారు.
ఈ ఘటనలో ఇస్మాయిల్ తో పాటు ఉన్న జహంగీర్ కూడా బుల్లెట్ గాయాలయ్యాయని పోలీసులు చెప్పారు. అతడిని ఆసుపత్రిలో చేర్పించామన్నారు. జహంగీర్ కు ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారని డీసీపీ సందీప్ రావు తెలిపారు. జహంగీర్ కోలుకున్న తర్వాత ఈ ఘటనకు సంబంధించి ప్రశ్నిస్తామన్నారు.
also read:హైదరాబాద్ మాదాపూర్ లో కాల్పుల కలకలం, ఒకరి మృతి
మృతుడు ఇస్మాయిల్ పై కూడా కేసులున్నాయని పోలీసులు చెప్పారు. ఓ హత్య కేసులో ఇస్మాయిల్ పై కేసు నమోదైందని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇస్మాయిల్ పై కాల్పులు జరిపిన నిందితులపై కూడా కేసులున్నాయని కూడా తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఈ విషయాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని సందీప్ రావు తెలిపారు.
నిందితులకు కంట్రీమేడ్ రివాల్వర్ ఎక్కడి నుండి వచ్చిందనే విషయమై ఆరా తీస్తున్నామన్నారు. నిందితులిద్దరూ ఒకే కారులో వచ్చారన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఎంతమంది ఉన్నారనే విషయమై ఆరా తీస్తున్నామన్నారు. నిందితులు దొరికితే ఈ కేసుకు సంబంధించి కీలక సమాచారం లభ్యమయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.