Asianet News TeluguAsianet News Telugu

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద బాలుడి కిడ్నాప్: గంట వ్యవధిలోనే కిడ్నాపర్ అరెస్ట్

కింద్రాబాద్ లో కిడ్నాపైన బాలుడిని పోలీసులు రక్షించారు. గంట వ్యవధిలోనే పోలీసులు కిడ్నాపర్ ను అరెస్ట్ చేశారు. బాలుడిని పోలీసులు రక్షించడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
 

Hyderabad Police Rescues Child From Kidnapper
Author
First Published Sep 30, 2022, 10:23 AM IST

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం నాడు కిడ్నాపైన బాలుడిని  పోలీసులు రక్షించారు. బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. గంట వ్యవధిలోనే కిడ్నాపర్ నుండి బాలుడిని పోలీసులు రక్షించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్  వద్ద  బాలుడిని మహిళ కిడ్నాప్ చేసింది. ఈ విషయమై బాధితురాలు పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆటోలో నిందితురాలు వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. సీసీటీవీలో ఆటో నెంబర్ ఆధారంగా పోలీసులు  ఆటో వెళ్లిన రూట్లలోని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు.ఈ సమాచారం ఆధారంగా అప్రమత్తమైన పోలీసులు  కవాడీగూడలో కిడ్నాపర్ వెళ్తున్న ఆటోను నిలిపివేశారు. మహిళ వద్ద బాలుడిని పోలీసులు  తీసుకొని తల్లికి అప్పగించారు. కిడ్నాపర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గంట వ్యవధిలోనే పోలీసులు కిడ్నాపర్ ను అరెస్ట్ చేశారు. 

గతంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో చిన్న పిల్లలను కిడ్నాప్ చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నెల 14వ తేదీన కృష్ణా జిల్లాలోని మచిలీపట్టణంలో ఐదు నెలల  శిశువు అదృశ్యమైంది. బిడ్డతో కలిసి పడుకున్న సమయంలో చిన్నారిని కిడ్నాపైంది. ఉదయం లేచి చూసేసరికి చిన్నారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో  బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఈ ఏడాది ఆగస్టు  19న తెలంగాణలోని జగిత్యాలలో  పసిపాప కిడ్నాపైంది.  మద్యం మత్తులో ఉన్న వ్యక్తి చిన్నారిని ఎత్తుకుని తిరుగుతున్న సమయంలో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద ఉన్న చిన్నారిని పోలీసులు సఖి కేంద్రానికి తరలించారు. బిక్షాటన చేస్తున్న యువతి నుండి చిన్నారిని కిడ్నాప్ చేసినట్టుగా నిందితుడు ఒప్పుకున్నాడు. 

మరో వైపు కరీంనగర్ జిల్లాలో ఈ ఏడాది ఆగస్టు 15  వ తేదీన చిన్నారి కిడ్నాపైన ఘటన చోటు చేసుకుంది. ఏడాదిన్నర చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో నిందితుడు కిడ్నాప్ చేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాపర్ ను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios