కారంపొడి, రాళ్లతో పోలీసులపై దాడికిదిగిన భూకబ్జాధారులు, ఎస్సైకి తీవ్ర గాయాలు

Hyderabad police personnel attacked by locals
Highlights

కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమిలో అక్రమంగా వెలిసిన ఇళ్లను కూల్చివేయడానికి ప్రయత్నించిన పోలీసులపై కబ్జాదారులు దాడికి దిగారు. కారం పొడి, రాళ్లతో ఇళ్లను కూల్చడానికి వచ్చిన పోలీసులపైనే దాడి చేశారు. దీంతో పోలీసులు కూడా ఆందోళనకారులపై లాఠీచార్జ్ కి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తం మారింది. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది.  

శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి గ్రామంలోని కేశవ్‌నగర్‌ కాలనీ సమీపంలో సర్వే నంబర్ 37/2లో రెండెకరాల ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంది. ఇందులో కొన్ని స్థానిక కుటుంబాలు తాత్కాలికంగా ఇళ్ల నిర్మాణం చేసుకుని నివసిస్తున్నారు. అయితే ఈ స్థలంలో డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణం చేపట్టాలని భావించిన ప్రభుత్వం అందులో నివాసముంటున్న కబ్జాధారులను ఖాళీ చేయాలని కోరింది. అయితే ఈ స్థలాన్ని ఖాళీ చేయడానికి కబ్జాధారులు ఒప్పుకోకపోవడంతో పోలీసుల సాయంతో వారిని ఖాళీ చేయించాలని రెవెన్యూ అధికారులు భావించారు.

భారీ పోలీసుల బందోబస్తు మధ్య మంగళ వారం ఉదయం మూడు జేసీబీలతో రెవెన్యూ సిబ్బంది అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రారంభించారు. అయితే ఈ నిర్మాణాల్లో నివాసముంటున్నవారు కూల్చివేతలను అడ్డుకోగా పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులు తమతో తెచ్చుకున్న గొడ్డుకారం, రాళ్లతో పోలీసులపై దాడికి దిగారు. ఈ దాడిలో మాదాపూర్ ఎస్సై శ్యాం ప్రసాద్ తల పగిలి తీవ్ర గాయాలయ్యాయి. మరికొంతమంది కానిస్టేబుళ్లకు కూడా గాయాలయ్యాయి. దీంతో పోలీసులు లాఠీ చార్జి చేసి నిరసనకారులను చెదరగొట్టారు.  

పోలీసులపై దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్రమాలను కూల్చేసిన రెవెన్యూ అధికారులు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

loader