ట్యాంక్ బండ్ పై గణేష్ ఉత్సవ సమితి బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు: ఉద్రిక్తత, అరెస్ట్
హైద్రాబాద్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద మంగళవారం నాడు ఉద్రిక్తత చోటు చేసుకొంది. ట్యాంక్ బండ్ పై భాగ్యనగర ఉత్సవ సమితి బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెప్పారు. ఉత్సవ సమితి సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: హైద్రాబాద్ తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద మంగళవారం రాడు ఉదయం ఉద్రిక్తత చోటు చేసుకుంది.భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి నిర్వహించ తలపెట్టిన బైక్ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద రోడ్డుపై బైఠాయించారు గణేష్ ఉత్సవ సమితి సభ్యులు.ఆందోళన చేస్తున్న భాగ్యనగర గణేష్ సమితి సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.
హుస్సేన్ సాగర్ లోనే గణేష్ విగ్రహల నిమజ్జనం కోసం అనుమతివ్వాలని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి డిమాండ్ చేస్తుంది. హుస్సేన్ సగర్ చుట్టూ గణేష్ విగ్రహల నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించేందుకు గాను బైక్ ర్యాలీకి ఇవాళ భాగ్యనగర ఉత్సవ సమితి పిలుపునిచ్చింది. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు.
తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుండి ఎన్టీఆర్ మార్గ్ ద్వారా నెక్లెస్ రోడ్డు వరకు ర్యాలీ చేపట్టాలని గణేష్ ఉత్సవ సమితి భావించింది. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని భాగ్యనగర సమితి సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారరు.గత ఏడాదిలో హుస్సేన్ సాగర్ లో ఎలా ఏర్పాట్లు చేశారో ఈ ఏడాది కూడా ఏర్పాట్లు చేయాలని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి డిమాండ్ చేస్తుంది.
ఈ నెల 9వ తేదీన గణేష్ విగ్రహల నిమజ్జనం చేస్తామని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి సోమవారం నాడు ప్రకటించింది. హుస్సేన్ సాగర్ లోనే వినాయక విగ్రహల నిమజ్జనం చేస్తామని ఉత్సవ సమితి ప్రకటించింది. ప్రభుత్వం ఏ చర్యలు తీసుకొన్నా తాము మాత్రం హుస్సేన్ సాగర్ నే వినాయక విగ్రహల నిమజ్జనం చేస్తామని ఉత్సవ సమితి ప్రకటించింది. ఇందులో భాగంగానే ఇవాళ బైక్ ర్యాలీని నిర్వహిస్తామని నిన్ననే ఉత్సవ సమితి ప్రకటించింది.
గణేష్ విగ్రహల నిమజ్జం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిన్న ప్రకటించారు. పండుగలను కూడ రాజకీయాల కోసం వాడుకోవడం సరైంది కాదని ఆయన బీజేపీకి సూచించారు.ట్యాంక్ బండ్ పై వినాయక విగ్రహల నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు
గణేష్ విగ్రహల నిమజ్జనానికి ప్రభుత్వం ఆటంకాలు కల్పిస్తుందని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. ఇలానే ఆటంకాలు కల్పిస్తే ప్రగతి భవ న్ లో వినాయక విగ్రహలను నిమజ్జనం చేస్తామని బండి సంజయ్ నిన్న వార్నింగ్ ఇచ్చారు.