సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటి ముందు ఎలాంటి రెక్కీ జరగలేదని పోలీసులు శుక్రవారం ప్రకటించారు. పవన్ కల్యాణ్‌పై ఎలాంటి రెక్కీ కానీ, దాడికి కుట్ర గాని జరగలేదని తేల్చారు.
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హత్యకు కొందరు కుట్ర పన్నారంటూ వస్తున్న వార్తలు తెలుగునాట కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు సంచలన ప్రకటన చేశారు. పవన్ ఇంటి ముందు ఎలాంటి రెక్కీ జరగలేదని పోలీసులు శుక్రవారం ప్రకటించారు. పవన్ కల్యాణ్‌పై ఎలాంటి రెక్కీ కానీ, దాడికి కుట్ర గాని జరగలేదని తేల్చారు.
గత సోమవారం రాత్రి పవన్ కల్యాణ్ ఇంటి ముందు కారు ఆపారు ముగ్గురు యువకులు. ఈ క్రమంలో కారు తీయమని అడిగిన సెక్యూరిటీ సిబ్బందితో యువకులు గొడవ పడ్డారు. అయితే పోలీసుల విచారణలో తాము మద్యం మత్తులోనే గొడవ చేసినట్లు సదరు యువకులు అంగీకరించారు. దీంతో యువకులను విచారించి నోటీసులు ఇచ్చారు జూబ్లీహిల్స్ పోలీసులు. గలాటా చేసిన వారిని ఆదిత్య, వినోద్, సాయికృష్ణగా గుర్తించారు పోలీసులు. తాగుబోతులు చేసిన రగడ తప్ప రెక్కీ కాదని తేల్చారు పోలీసులు.
Also Read:పవన్ హత్యకు రెక్కీ... ప్రశ్నిస్తే భద్రత పెంచరా : ఏపీ ప్రభుత్వంపై సీఎం రమేశ్ ఆగ్రహం
ఇకపోతే.. ఇకపోతే.. పవన్ కల్యాణ్‌ను అనుమానాస్పద వ్యక్తులు అనుసరించడంపై జనసేన పార్టీ నేతలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘‘ఈ మధ్య పవన్ కల్యాణ్‌ను అనుమానాస్పద వ్యక్తులు ఎక్కువగా అనుసరిస్తున్నారు. విశాఖ సంఘటన తరువాత పవన్ కల్యాణ్ ఇల్లు, పార్టీ కార్యాలయం దగ్గర సందేహాస్పదంగా ఉన్న వ్యక్తులు తచ్చాడుతున్నారు. పవన్ కల్యాణ్ ఇంటి నుంచి బయటకు వెళుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు ఆయన వాహనాన్ని అనుసరిస్తున్నారు. కారులోని వ్యక్తులు పవన్ కల్యాణ్ వాహనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. అనుసరిస్తున్న వారు అభిమానులు కాదని పవన్ కల్యాణ్ వ్యక్తిగత రక్షణ సిబ్బంది చెబుతున్నారు.
వారి కదలికలు అనుమానించే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కారులో, మంగళవారం నాడు ద్విచక్రవాహనాలపై అనుసరించారు. కాగా సోమవారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు పవన్ కల్యాణ్ ఇంటి వద్దకు వచ్చి గొడవ చేశారు. ఇంటికి ఎదురుగా వారు కారు ఆపారు. సెక్యూరిటీ సిబ్బంది నివారించబోగా బూతులు తిడుతూ, పవన్ కల్యాణ్‌ను దుర్భాషలాడుతూ గొడవ చేశారు. సిబ్బందిని కవ్వించి రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. ఆయినా సంయమనం పాటించిన సిబ్బంది.. ఈ సంఘటనను వీడియో తీసి జనసేన తెలంగాణ ఇంచార్జి శంకర్ గౌడ్‌కు అందించగా ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ రోజు పిర్యాదు చేశారు’’అని నాదెండ్ల మనోహర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
