హైదరాబాద్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ ను మంగళవారం నాడు హైద్రాబాద్ పోలీసులు తనిఖీ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నిలను పురస్కరించుకొని పోలీసులు ఈ కాన్వాయ్ ని తనిఖీ చేశారు.

హైద్రాబాద్ నుండి  విజయవాడకు లోకేష్ వెళ్తున్న సమయంలో పోలీసులు ఈ కాన్వాయ్ లోని వాహనాలను తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలోనే లోకేష్ కాన్వాయ్ ను తనిఖీ చేశామని పోలీసులు ప్రకటించారు.

వీడియో

"

జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా హైద్రాబాద్ లో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. డిసెంబర్ 1వ తేదీన జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేయనున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ దఫా టీడీపీ కూడా పోటీ చేస్తోంది. టీడీపీ 106 స్థానాల్లో పోటీ చేస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ ఒక్క కార్పోరేట్ స్థానంలోనే విజయం సాధించింది.2014 నుండి తెలంగాణలోని టీడీపీ నేతలు ఇతర పార్టీల్లో చేరారు. దీంతో ఆ పార్టీ బలహీనపడింది.కీలక నేతలు, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలలో చేరారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా తమ ఉనికిని చాటుకోవాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.