సరూర్‌నగర్‌లో పరువు హత్యలో పురోగతి: నాగరాజు కదలికలపై రెక్కీ, పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు

హైద్రాబాద్ సరూర్‌నగర్ లో నాగరాజును హత్య చేసిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. మతాంతర వివాహం చేసుకొన్నందుకు కక్ష గట్టి నాగరాజును ఆశ్రిన్ కుటుంబ సభ్యులు హత్య చేశారు.

Hyderabad Police Gathers Key Information In Saroornagar Honour Killing Case


హైదరాబాద్: హైదరాబాద్ Saroornagar లో Honour Killing కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మతాంతర వివాహం చేసుకున్న Nagaraju ను  హత్య  చేసిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.గురువారం నాడు సాయంత్రం ఇద్దరు నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారు.

Vikarabad జిల్లాకు చెందిన ఖిల్లాపురం నాగరాజు, సయ్యద్ ఆశ్రిన్ సుల్తానాలు కొంత కాలం క్రితం ప్రేమించుకొన్నారు.ఈ ఏడాది జనవరి  31 ఆర్య సమాజ్ లో Marriage చేసుకొన్నారు. ఈ మతాంతర వివాహానికి రెండు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. వివాహం చేసుకొన్న తర్వాత నాగరాజు, Ashrin లు  Vizag లో నివాసం ఉంటున్నారు. మతాంతర వివాహం చేసుకొవడాన్ని  నాగరాజు కుటుంబ సభ్యులు కూడా వ్యతిరేకించారు. అయితే నాగరాజు లేకపోతే తాను Suicide చేసుకొంటానని ఆశ్రీన్ బెదిరించడంతో నాగరాజు ఆమెను పెళ్లి చేసుకొన్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఆశ్రిన్ ను తీసుకెళ్లాలని కూడా వారి కుటుంబ సభ్యులకు చెబితే ఆశ్రిన్ ఆత్మహత్య చేసకుంటానని బెదరించిందని నాగరాజు ఫ్యామిలీ మెంబర్స్ గుర్తు చేసుకొంటున్నారు.

నాగరాజును పెళ్లి చేసుకొంటే అతడిని హత్య చేస్తామని ఆశ్రిన్ కుటుంబ సభ్యులు వార్నింగ్ ఇచ్చారు. పెళ్లికి ముందు ఇచ్చిన వార్నింగ్ కు అనుగుణంగానే బుధవారం నాడు రాత్రి నాగరాజుని Saroornagar  మున్సిపాలిటీ సమీపంలో నిందితులు హత్య చేశారని పోలీసులు చెబుతున్నారు.

ఆశ్రీన్ ను వివాహం చేసుకున్న తర్వాత నాగరాజు  వైజాగ్ లో నివాసం ఉంటుననాడు. అయితే ఆశ్రిన్ ను నాగరాజు పెళ్లి చేసుకోవడాన్ని ఆశ్రిన్ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో నాగరాజుపై కక్ష పెంచుకొన్నారు. నాగరాజును హత్య చేయాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే  నాగరాజు కదలికలపై కన్నేయాలని నిర్ణయం తీసుకొన్నారు. వైజాగ్ నుండి ఐదు రోజుల క్రితమే నాగరాజు తన భార్యతో కలిసి Hyderabad కు వచ్చాడు.  నాగరాజు కదలికలపై ఆశ్రిన్ సోదరులు నిఘాను పెట్టారు. సరూర్‌నగర్ లో బంధువుల ఇంటికి భార్యతో కలిసి నాగరాజు వెళ్తున్న విషయాన్ని గుర్తించిన ఆశ్రిన్ సోదరుడు, బావ నాగరాజును చంపాలని నిర్ణయం తీసుకొన్నారు.

బుధవారం నాడు రాత్రి సరూర్ నగర్ మున్సిపల్ కార్యాలయానికి సమీపంలోనే Bike పై వెళ్తున్న నాగరాజును అత్యంత దారుణంగా హత్య చేశారు. నాగరాజు  తలకు హెల్మెట్ పెట్టుకొన్నాడు. అయితే హెల్మెట్ పై నుండి రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో నాగరాజు అక్కడికక్కడే మరణించాడు. ఈ సమయంలో ఆశ్రిన్ నాగరాజుపై దాడి చేయకుండా అడ్డుకొనే ప్రయత్నం చేసింది. నాగరాజున చంపిన వారిలో ఆశ్రిన్ సోదరుడితో పాటు బావను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

నాగరాజును హత్య చేసిన నిందితులను తమకు చూపించాలని మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు గురువారం నాడు ఉదయం ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని నాగరాజు స్వగ్రామానికి తీసుకెళ్లకుండా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు.  డెడ్ బాడీని స్వగ్రామానికి తరలించేందకు పోలీసులు ఇచ్చిన డబ్బును కూడా నాగరాజు కుటుంబ సభ్యులు తిరస్కరించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios