Asianet News TeluguAsianet News Telugu

పెట్రోల్ ధరల పెంపుపై నిరసన: 20 రోజుల తర్వాత హైద్రాబాద్ పోలీసుల కేసు, ఎందుకో తెలుసా?

పెట్రోల్, డీజీల్, ఎల్పీజీ గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ నిరసన తెలిపిన విపక్షాలపై హైద్రాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిరసన కార్యక్రమం చేపట్టిన 20 రోజుల తర్వాత పోలీసులు కేసులు నమోదు చేయడం గమనార్హం

Hyderabad police files case against congress and left leaders lns
Author
Hyderabad, First Published Jul 7, 2021, 9:50 AM IST

హైదరాబాద్: పెట్రోల్, డీజీల్, ఎల్పీజీ గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ నిరసన తెలిపిన విపక్షాలపై హైద్రాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిరసన కార్యక్రమం చేపట్టిన 20 రోజుల తర్వాత పోలీసులు కేసులు నమోదు చేయడం గమనార్హందేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు  విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో  గత నెలలో కాంగ్రెస్, సీపీఐలు నిరసన కార్యక్రమాలను నిర్వహించాయి. ఈ నిరసన కార్యక్రమాలను పురస్కరించుకొని  ట్యాంక్ బండ్  పై నుండి  హుస్సేన్ సాగర్ లో బైక్ ను, గ్యాస్ సిలిండర్ ను వేసి నిరసన తెలిపారు.

కాంగ్రెస్ నేతలు తమ నిరసన కార్యక్రమం సందర్భంగా బైక్ ను  లాక్కెళ్లారు. ఆ తర్వాత హుస్సేన్ సాగర్  లో వేశారు. సీపీఐ  నేతలు కూడ ఇదే తరహలో నిరసనకు దిగారు. గ్యాస్ సిలిండర్ల ధరల పెంపును నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్  ను హుస్సేన్ సాగర్ లో  వేశారు సీపీఐకి చెందిన మహిళా సంఘం నేతలు.

ఈ ఆందోళనపై ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హుస్సేన్ సాగర్  లో బైక్,  గ్యాస్ సిలిండర్ వేయడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు.  మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా  ఆగ్రహం వ్యక్తం చేయడంతో గాంధీనగర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. కాంగ్రెస్, సీపీఐ నేతలపై కేసులు నమోదు చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios