చిన్నారులు, యువతుల రక్షణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం త్వరలో ప్రత్యేక చట్టం తీసుకురాబోతోందన్నారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.  తరహా ఘటనల్లో కొత్త చట్టం విద్యా సంస్థల మేనేజ్‌మెంట్‌ను బాధ్యతగా చేయబోతోందని ఆనంద్ వెల్లడించారు.

చిన్నారులు, యువతుల రక్షణపై హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్కూళ్లు, కాలేజీల్లో అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలపై ప్రత్యేక చట్టం తీసుకొస్తున్నట్లు తెలిపారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని సీపీ చెప్పారు. ఈ తరహా ఘటనల్లో కొత్త చట్టం విద్యా సంస్థల మేనేజ్‌మెంట్‌ను బాధ్యతగా చేయబోతోందని ఆనంద్ వెల్లడించారు. బంజారాహిల్స్ డీఏవీ స్కూల్‌లో జరిగిన ఘటన తర్వాత ఈ చట్టంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని కమీషనర్ పేర్కొన్నారు. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీల్లో చిన్నారులు, యువతులపై అఘాయిత్యాలు పెరుగుతున్నట్లు సీపీ చెప్పారు. యాంటీ డ్రగ్స్ కమిటీల మాదిరిగానే ఈ చట్టం పనిచేస్తుందని కమీషనర్ పేర్కొన్నారు. దేశంలో గోవా డ్రగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని సీపీ చెప్పారు. గోవాలో వుంటూ హైదరాబాద్‌లో డ్రగ్స్ అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకుంటామని ఆనంద్ హెచ్చరించారు.