ప్రేమిస్తున్నానంటూ చెప్పగానే నిజమని నమ్మేశాడు. అతనికి ఆమె సర్వం అర్పించుకుంది. తీరా అతనికి అంతకముందే పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిసి షాకైంది. అయినా సరే తనను పెళ్లి చేసుకోవాలని నిలదీసింది. దీంతో అతను పరారీలో ఉన్నాడు. మోసపోయానని గుర్తించిన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి విరవాల్లోకి వెళితే.. నిజాంపేట రాజీవ్ గృహకల్ప సముదాయంలో నివసించే కుటుంబం కూకట్ పల్లి జేఎన్ టీయూ వద్ద ఓ హోటల్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో బాచుపల్లికి చెందిన ఆటో డ్రైవర్ రవిగౌడ్ హోటల్ కి అవసరమైన సరకులను సరఫరా చేసేవాడు. ఈ క్రమంలో యజమాని కుమార్తె(20)తో అతను కొన్నాళ్లుగా ప్రేమాయణం సాగించాడు.

Also Read హాస్టల్ లో ఉరివేసుకొని మహిళా టెక్కీ ఆత్మహత్య...

వివాహం చేసుకుంటానని నమ్మించి ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు. తీరా పెళ్లి చేసుకోమని నిలదీయడంతో పత్తాలేకుండా పోయాడు.  అయితే అతనికి అప్పటికే వివాహమై భార్య, పిల్లలు ఉన్నట్లు తెలిసింది. దీంతో అతడితోనే వివాహం జరిపించాలని డిమాండ్ చేస్తూ బాధితురాలు మంగళవారం బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

అయితే.. అప్పటికే యువతి పురుగుల మందు తాగడం గమనార్హం. గుర్తించిన పోలీసులు ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా... యువతి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని పోలీసులు  చెబుతున్నారు.